శరీరంలో 18 బుల్లెట్స్... ప్రాణాలతో బయటపడ్డాడు

By telugu teamFirst Published Jun 10, 2019, 3:29 PM IST
Highlights

శరీరానికి ఒక్క బులెట్ తగిలితేనే చాలా మంది ప్రాణాలు కోల్పోతారు.అలాంటిది... ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 18 బులెట్స్ శరీరంలోకి దూసుకువెళ్లాయి. అయినా.. ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. 


శరీరానికి ఒక్క బులెట్ తగిలితేనే చాలా మంది ప్రాణాలు కోల్పోతారు.అలాంటిది... ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 18 బులెట్స్ శరీరంలోకి దూసుకువెళ్లాయి. అయినా.. ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...బిహార్ లోని రాజ్ పూర్ గ్రామానికి చెందిన పంకజ్ కుమార్ సింగ్(26) పలు కేసుల్లో నిందితుడు. ఇటీవలే అతను జైలు నుంచి బయటకు వచ్చాడు. కాగా... అతనిపై ఎప్పటి నుంచో పగతో రగలి పోతున్న అతని ప్రత్యర్థులు పంకజ్ ని చంపేందుకు స్కెచ్ వేశారు.

అతను జైలు నుంచి బయటకు వచ్చిన సమాయాన్ని అదనుగా చేసుకొని చంపేందుకు ప్లాన్ వేశారు. అతన్ని అనుసరించి కాల్పులు జరిపి పారిపోయారు. పంకజ్ శరీరంలో 18 బుల్లెట్ గాయాలయ్యాయి. బాధితుడికి ఏడు గంటల పాటు చికిత్స చేసి బుల్లెట్లను బయటకు తీశారు వైద్యులు. ఛాతీ, కాళ్లు, చేతులు, కడుపు, మూత్రపిండాలు, కాలేయంలో ఉన్న బుల్లెట్లను బయటకు తీయడంతో పంకజ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

click me!