Miracle : బిల్డింగ్‌పై నుంచి జారీ.. రోడ్డుపై రిక్షాలో పడ్డ చిన్నారి

By sivanagaprasad KodatiFirst Published Oct 20, 2019, 5:17 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌లోని టికమ్‌ఘర్‌లోని ఓ బిల్డింగ్ పైనుంచి మూడేళ్ల బాలుడు జారీపడ్డాడు. అదే సమయంలో సమయంలో బిల్డింగ్ కింద రోడ్డుపై వెళ్తున్న రిక్షాలో పడ్డాడు. దీంతో పెనుప్రమాదం తప్పి చిన్నారి స్వల్పగాయాలతో బతికి బయటపడ్డాడు. 

వీడికి భూమి మీద నూకలు ఉన్నాయి రా.. అందుకే బతికి బయటపడ్డాడు.. అదృష్టం బాగుంటే రైలు కిందపడ్డా ప్రాణాలతో బయటపడతాడు.. దురదృష్టం తరుముకొస్తే సైకిల్ కింద పడినా చావకతప్పదు. ఈ వార్తను నిజం చేస్తూ అలాంటి సంఘటనే జరిగింది.

ఓ చిన్నారి ప్రమాదవశాత్తూ బిల్డింగ్ పై నుంచి జారీ.. సరిగ్గా రోడ్డుపై రిక్షాలో వెళుతున్న ఓ రిక్షాలో పడింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని టికమ్‌ఘర్‌లోని ఓ బిల్డింగ్ పైనుంచి మూడేళ్ల బాలుడు జారీపడ్డాడు.

అదే సమయంలో సమయంలో బిల్డింగ్ కింద రోడ్డుపై వెళ్తున్న రిక్షాలో పడ్డాడు. దీంతో పెనుప్రమాదం తప్పి చిన్నారి స్వల్పగాయాలతో బతికి బయటపడ్డాడు. ప్రస్తుతం ఆ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అయితే రెండో అంతస్తులో తమతో ఆడుకుంటున్న తమ కుమారుడు అనుకోకుండా కిందకు జారి పోయాడని అతని తండ్రి ఆశిష్ జైన్ తెలిపాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడికి దగ్గరలో ఉన్న సీసీటీవీలో నమోదు కావడంతో వైరల్ అయ్యాయి.

అచ్చం ఇలాంటి అదృష్టవంతుడే ఈ మధ్య శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లలో ప్రాణాలతో బతికి బట్టకట్టాడు. అభినవ్ అనే వ్యక్తి.. 2008లో ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడుల్లో తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.

దాదాపు 11 ఏళ్ల తర్వాత మృత్యువు మరోసారి మనోడిని వెంటాడింది. శ్రీలంక రాజధాని కొలంబోలోని సిన్నామన్ గ్రాండ్ హోటల్‌లో అభినవ్ తన భార్యతో పాటు బస చేశాడు. ఈస్టర్ సండే రోజున అతను బ్రేక్ ఫాస్ట్ చేసి దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళాడు.

శ్రీలంక పేలుళ్లు: ఒక చోట తప్పించుకున్నా.. మరోచోట బలి

ఈ సమయంలో చర్చి ప్రాంగణాన్ని విడిచి వెళ్లాల్సిందిగా అనౌన్స్‌మెంట్ వినిపించింది. ఆ కొద్దిసేపటికీ ఆ ప్రదేశమంతా బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో 100 అడుగుల బోరు బావిలో పడిన ఓ బాలుడు క్షేమంగా బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర సమీపంలోని షేర్‌ఘర్ గ్రామంలో ఐదేళ్ల బాలుడు ప్రవీణ చెట్లు నుంచి పండ్లు కోస్తూ పొరపాటున బోరు బావిలో పడ్డాడు.

బోరు బావి నుంచి అరుపులు వస్తుండటంతో స్థానికులు అక్కడికి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీకి సమాచారం అందించింది.

మృత్యుంజయుడు: 100 అడుగుల బోరు బావి నుంచి బాలుడి వెలికితీత

రంగంలోకి దిగిన సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు మొదలుపెట్టాయి. 100 అడుగుల బావికి సమాంతరంగా గొయ్యి తవ్వడంతో పాటు చిన్నారికి పైప్ ద్వారా ఆక్సిజన్ అందించారు.

ఎనిమిది గంటల పాటు శ్రమించి బాలుడిని ఆదివారం ఉదయం సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని మధుర చీఫ్ మెడికల్ అధికారి షేర్ సింగ్ తెలిపారు.

నిరుపయోగంగా ఉన్న బోరుబావి చుట్టూ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. 
 

click me!