బాలీవుడ్ ను ఆకర్షిస్తున్న కాశ్మీర్ అందాలు.. ఫిల్మ్ టూరిజానికి మళ్లీ పెరుగుతున్న ఆదరణ

Published : Aug 19, 2023, 01:41 PM IST
బాలీవుడ్ ను ఆకర్షిస్తున్న కాశ్మీర్ అందాలు.. ఫిల్మ్ టూరిజానికి మళ్లీ పెరుగుతున్న ఆదరణ

సారాంశం

సినిమా పరిశ్రమకు, కాశ్మీర్‌కు మధ్య ఉన్న సంబంధం చాలా పాతది. కేంద్ ప్రభుత్వం తీసుకవచ్చిన నూతన సినిమా విధానం వల్ల లోయలో సినిమా షూటింగ్‌కు మార్గం సుగమమైంది. చాలా కాలం తర్వాత కాశ్మీర్‌లో సినిమా థియేటర్లు తెరవడం ప్రారంభమైంది. కాశ్మీర్ లో చిత్రపరిశ్రమను ఎలా ఆదరిస్తున్నారో కాశ్మీరీ నటుడు మీర్ సర్వర్ వివరించారు. ఆయన.. సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ బజరంగీ బాయిజాన్‌ సినిమాతో చిత్రసీమలోకి అరంగేట్రం చేశారు. 

బాలీవుడ్‌ బ్లాక్ బస్టర్ మూవీ బజరంగీ భాయిజాన్‌లో మున్నీ తండ్రి పాత్రలో నటించిన మీర్ సర్వార్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రంలో అతడు చిన్న పాత్ర పోషించినప్పటికీ.. ఒక పెద్ద బ్యానర్ లో భారీ బడ్జెట్ చిత్రంతో అతడు సినీరంగ ప్రవేశం చేయడంతో ఆయనకు అనేక అవకాశాలు వచ్చాయి. అనంతరం.. ఈ కాశ్మీరీ నటుడు .. కేసరి, డిషూమ్, జాలీ ఎల్‌ఎల్‌బి, హమీద్ మొదలైన చిత్రాలలో నటించే అవకాశం వచ్చింది.  అందివచ్చిన అవకాశాలను  సద్వినియోగం చేసుకుంటూ.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు.

కాశ్మీర్ తో బాలీవుడ్ కు సంబంధాలు మెరుగపడటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇది స్థానిక చిత్ర పరిశ్రమకు పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారతదేశం అంతటా హౌస్‌ఫుల్‌గా నడుస్తున్న గద్దర్-2లో అతను కీలక పాత్ర పోషిస్తున్నందున.. ఏదో ఒక రోజు కాశ్మీర్‌లో చలనచిత్ర పరిశ్రమ నెల్పబడుతుందని  ఆశించారు. కాశ్మీర్ కళాకారులు చాలా ప్రతిభావంతులని, వారు అవకాశాల కోసం వేచిచేస్తున్నారని తెలిపారు.  

ఇటీవల ఈ కాశ్మీరీ నటుడు మీర్ సర్వర్ ఆవాజ్- ది వాయిస్ తో  మాట్లాడుతూ.."తన జీవిత అనుభవాలను పంచుకున్నారు.  “నాకు గుర్తున్నంత వరకు.. నేను 1990లలో కాశ్మీర్‌లో కొంత కాలం షూటింగ్ చేశాను. కానీ, ఆ తరువాత కాలంలో ఇక్కడ జరిగిన ఘర్షణల వల్ల కొంతకాలం సినిమాల షూటింగ్ జరగలేదు. కానీ, 1997 తర్వాత మళ్లీ సినిమాల షూటింగ్‌లు మొదలయ్యాయి. కానీ, కొన్ని సినిమాల షూటింగ్ మాత్రమే జరిగిందనేది కూడా నిజం. ఆ సమయంలో.. బజరంగీ భాయిజాన్, రాక్‌స్టార్, ఫతూర్ సినిమాలు కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించబడ్డాయి. కశ్మీర్‌లో సినిమా విధానంలో వచ్చిన మార్పుల వల్ల చాలా మంది ఇక్కడ(కాశ్మీర్ లో) సినిమాలు తీస్తున్నారు. ఐదు నుండి ఏడు సంవత్సరాలుగా మరుగునపడిన సంబంధాలు మళ్లీ పునరుద్ధరించబతున్నాయి. సినిమాల చిత్రీకరణ కోసం బాలీవుడ్ కూడా మరోసారి కాశ్మీర్ వైపు మొగ్గు చూపుతోంది" అని తెలిపారు.   

కాశ్మీర్ లోయలలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన ఎన్నో పాటలను ఐకానిక్‌గా మిగిలిపోయాయనీ, అలాగే ఈ ఐకానిక్ సాంగ్స్ కు పనిచేసే.. కవులు, సంగీతకారులు, గాయకులు, నటీనటుల కేరీర్ కూడా ఎంతగానో దోహదపడుతాయని ఆయన చెప్పారు. నేటీకీ ఆ పాటను చిత్రీకరించిన లోకేషన్లను చూడటానికి.. ఈ ప్రాంతాల అందాలను అనుభూతి చెందడానికి ఇక్కడి వస్తారని తెలిపారు.

దేశంలో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు కూడా సినిమాలు దోహదపడతాయని మీర్ సర్వర్ చెప్పుకొచ్చారు. ఇక్కడ సినిమాలు తీస్తే.. వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయనీ, సినిమాలు కేవలం వినోద సాధనం మాత్రమే కాకుండా వివిధ రంగాలపై ప్రభావం చూపుతాయని అన్నారు. ప్రతి సబ్జెక్ట్‌ని సినిమాగా తీయాలని, మిగతాది ప్రేక్షకులకే వదిలేయాలని మీర్‌ సర్వార్‌ అభిప్రాయపడ్డారు. వారు ఏమి చూడాలనుకుంటున్నారో అది వారి నిర్ణయమన్నారు. 

సినిమా పరిశ్రమకు, కాశ్మీర్‌కు మధ్య ఉన్న సంబంధం చాలా పాతది. ప్రభుత్వ కొత్త సినిమా విధానం వల్ల లోయలో సినిమా షూటింగ్‌కు మార్గం సుగమమైంది. చాలా కాలం తర్వాత కాశ్మీర్‌లో సినిమా థియేటర్లు తెరవబడ్డాయని మీర్ సర్వార్ అన్నారు. సినిమాలు నిరంతరం నిర్మించబడుతున్నాయి, కానీ గతంలో ఇక్కడి ప్రజలు ఆ సినిమాలను చూడలేకపోయారు. కానీ, ఇప్పుడు ఇక్కడ సినిమాలు చిత్రీకరించబడతాయి. స్థానిక ప్రజలు వాటిని సినిమాల్లో చూడగలరని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హిందీ, ఇతర భాషలతో పాటు కాశ్మీర్‌లోని స్థానిక భాషల్లో సినిమాలు తీయడంపై దృష్టి పెట్టాలని మీర్ సర్వర్ తన కోరికను వ్యక్తం చేశారు.  

కాశ్మీర్‌లో తీసిన సినిమాల గురించి మీర్ సర్వర్ మాట్లాడుతూ.. ఇక్కడ నిర్మించిన స్వతంత్ర చిత్రాలు చాలా తక్కువ. దూరదర్శన్ చాలా సినిమాలను కమీషన్ చేసింది. మా టీమ్ కూడా 2018లో "కాశ్మీర్ డైలీ" చిత్రాన్ని రూపొందించింది. దర్శకుడు హుస్సేన్ ఖాన్. నిర్మాతగా కూడా నేనే ప్రధాన పాత్ర పోషించాను. ఈ చిత్రం థియేటర్లలో, OTT ప్లాట్‌ఫారమ్‌లో కూడా విడుదలైంది. ఈ బృందం కాశ్మీరీ భాషలో కూడా ఒక చిత్రాన్ని నిర్మించిందని, ఇది ప్రజల ప్రశంసలను పొందిందని ఆయన చెప్పారు.

సినిమాల్లో తనకు ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనుందనీ, తన ప్రతిభను వైవిధ్యంగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తానని మీర్ సర్వర్ అంటున్నాడు.తాను చిత్ర పరిశ్రమలో మల్టీ టాలెంటెండ్ యాక్టర్ గా గుర్తింపు పొందాలనుకుంటున్నాననీ, తాను కాశ్మీర్‌కు చెందిన వ్యక్తి కాబట్టి కొన్ని రకాల పాత్రలను మాత్రమే ఆఫర్ చేసి టైప్‌కాస్ట్ పొందకూడదని అతను చెప్పాడు. ప్రజలు తనను గుర్తించారని, ఇంకా తన ప్రయాణం చాలా సుదీర్ఘమైనదని ఆయన చెప్పారు. మీర్ సర్వర్ " జన్నాటి లాటరీ" చిత్రంలో ప్రధాన పాత్ర పోషించబోతున్నారు . కాశ్మీర్‌లో చిత్రీకరించే ఈ సినిమా ప్రిపరేషన్‌లో తాను 
బిజీగా ఉన్నానని తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indian Army Creates Modern Warfare Force: ఇండియన్ ఆర్మీ "మోడ్రన్ వార్‌ఫేర్ ఫోర్స్" | Asianet Telugu
India First Vande Bharat Sleeper Train: వందే భారత్ స్లీపర్ లోపల ఎలా ఉంటుందో తెలుసా? | Asianet Telugu