పదేళ్ల బాలికపై అత్యాచారం.. బ్లీడింగ్ కావడంతో ప్రైవేట్ పార్టులో మట్టి, ఇసుక పోసి..!

Published : Apr 10, 2023, 05:03 AM IST
పదేళ్ల బాలికపై అత్యాచారం.. బ్లీడింగ్ కావడంతో ప్రైవేట్ పార్టులో మట్టి, ఇసుక పోసి..!

సారాంశం

బిహార్‌లో ఓ పదేళ్ల బాలికపై లైంగికదాడి జరిగింది. అనంతరం, ఆమెకు విపరీతంగా రక్తస్రావం కావడంతో నిందితుడు ఆమె ప్రైవేట్ పార్టులో ఇసుక, మట్టి పోశాడు. పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.  

పాట్నా: బిహార్‌లో పదేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఆ తర్వాత బాధితురాలి ప్రైవేట్ పార్టులో ఇసుక పోసి నిందితుడు పారిపోయాడు. ఈ ఘటన బిహార్‌లోని పుర్నియా జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. దగరువా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

పదేళ్ల బాలిక మిత్రులతో కలిసి ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా అక్కడికి ఓ వ్యక్తి వచ్చాడు. ఇతర బాలికలను అక్కడి నుంచి వెళ్లమన్నాడు. ఆ పదేళ్ల బాలికను మాత్రమే తన వెంట తీసుకుని వెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి ఆమెను తీసుకె ళ్లిన తర్వాత ఆమె పై లైంగిక దాడి చేశాడు. బ్లీడింగ్ ఎక్కువ కావడంతో ఆమె ప్రైవేట్ పార్టులో మట్టి, ఇసుక పోశాడు.

ఆ బాలిక ఇంటి ముందు కనిపించకపోవడంతో తల్లి ఆరా తీసింది. ఇతర పిల్లలను అడిగింది. ఓ వ్యక్తి వచ్చి ఆమెను తీసుకెళ్లాడని చెప్పారు. 

పెద్ద సంఖ్యలో గ్రామస్తులు స్పాట్‌కు చేరుకున్నారు. బాధితురాలిని కాపాడారు. గ్రామస్తులు రావడాన్ని గమనించిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. స్థానిక గ్రామస్తులు వెంటనే పోలీసులకు విషయం చెప్పారు. 

Also Read: ప్రైవేట్ కంపెనీలో మేనేజర్‌తో వర్కర్ శారీరక సంబంధం.. గర్భం దాల్చిన తర్వాత హత్య.. హైదరాబాద్‌లో ఘటన

‘మేం నిందితు డిని పట్టుకున్నాం. పోక్సో యాక్ట్ కింద నిందితుడి పై కేసు పెట్టాం. బాధితురాలిని ట్రీట్‌మెంట్ కోసం ఆస్పత్రికి పంపించాం. నిందితు డిని సత్వర విచారణ చేపడతాం’ అని ఎస్పీ ఆమిర జవైద్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..