చెట్టుకు ఉరివేసుకుని మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య... ఇంట్లో తెలియడంతో దారుణం...

By SumaBala BukkaFirst Published Jun 28, 2022, 12:59 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ లో ఓ మైనర్ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఒకే తరగతిలో చదువుకుంటున్న వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో.. ఆమెను అమ్మమ్మ ఊరికి పంపించారు. 

ఉత్తరప్రదేశ్: Uttar Pradeshలోని బస్తీలో Minor love couple చెట్టుకు ఉరివేసుకుని Suicide చేసుకుంది. గ్రామంలోని గౌసియాహ్వా పోఖ్రే సమీపంలో చెట్టుకు ఉరి వేసుకున్న పదహారేళ్ల బాలిక, 17 ఏళ్ల బాలుడి మృతదేహాలు కనిపించాయని పోలీసు అధికారి తెలిపారు. ఈ జంట మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టంకు తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం చెలరేగింది. ఆదివారం తన సోదరుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు అని మృతుని సోదరులు తెలిపాడు. ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో ఫోన్ చేయడంతో అతను కట్ చేశాడన్నారు. 

అయితే సోదరుడు తన తో చాటింగ్ చేస్తూ చాలా దూరం వెళ్తున్నానని, ఇక తిరిగి రానని మెసేజ్ చేశాడు అని అన్నారు. కాగా, ఈ ఇద్దరు మైనర్లు ఒకే తరగతి లో చదువుకుంటున్నారు.  వారిద్దరూ ఏడాదిగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం వీరిద్దరూ కలిసి ఒకే చోట కనిపించడంతో బాలిక కుటుంబ సభ్యులు ఆ బాలికను అమ్మమ్మ గ్రామమైన  kamariyaకు పంపించారు. ఆదివారం వీరిద్దరూ కలుసుకున్నారు. ఆ తరువాత వీరి మృతదేహాలు కనిపించాయి. 

మృతులు మైనర్ లేనని పోలీస్ అధికారి అంబికారామ్ తెలిపారు. అమ్మాయికి పదహారేళ్లు,  అబ్బాయికి పదిహేడేళ్ల అని తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పోస్టుమార్టం కోసం తరలించారు. దీనికి సంబంధించిన రిపోర్టు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మృతురాలి తల్లి ఇంతకుముందే మృతి చెందిందని.. తండ్రి ముంబైలో పని చేస్తున్నాడని ఇరుగుపొరుగు వారు తెలిపారు. 

అక్కడ పానీపూరీపై నిషేధం.. ఎందుకో తెలుసా?

ఇదిలా ఉండగా, జూన్ 25న tihar jailలో ఓ ఖైదీ suicide చేసుకున్న ఘటన కలకలం రేపింది. 19యేళ్ల అండర్ ట్రయల్ ఖైదీలు Ceiling fanకు విగతజీవిగా వేలాడుతూ కనిపించినట్లు అధికారులు తెలిపారు.  ఉత్తర ప్రదేశ్లోని బదౌన్ జిల్లాకు చెందిన బ్రహ్మ్ నంద్ అలియాస్ వికాస్ కిడ్నాప్, రేప్ కేసుల్లో Pocso Act ప్రకారం ఫిబ్రవరి 4 నుంచి జైలులో ఉన్నట్లు సీనియర్ జైలు అధికారులు వెల్లడించారు. వికాస్  జైలులోని మొదటి అంతస్తులో అండర్ ట్రయల్ ఖైదీలు రికార్డు రూమ్లో సేవదార్ గా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఎప్పటిలాగా రికార్డు రూంకు వచ్చిన వికాస్..మళ్లీ కనిపించలేదు.మధ్యాహ్నం 2.50గంటలకు తన గది తలుపులు మూసి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన తోటి ఖైదీలు తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు.

అప్పటికే వికాస్ ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు.  వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా ..వికాస్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే ఏడాది జనవరిలో తీహార్ జైలులో ఐదుగురు ఖైదీలు ఆత్మహత్య ప్రయత్నించటం సంచలనం రేకెత్తించింది. పదునైన ఆయుధాలతో తమను తాము తీవ్రంగా గాయపరచుకున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు గాయపడ్డ ఐదుగురిని జైలు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఓ ఖైదీని దీన్ దయాల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. 

click me!