మైనర్ బాలికపై 76ఏళ్ల వృద్ద వ్యాపారి అత్యాచారం...

Published : Feb 13, 2019, 01:58 PM IST
మైనర్ బాలికపై 76ఏళ్ల వృద్ద వ్యాపారి అత్యాచారం...

సారాంశం

తమిళనాడు ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ వృద్ద వ్యాపారి తన మనవరాలి వయసున్న ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి వికృత చేష్టలతో బాలిక తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిపాలవడంతో ఈ అఘాయిత్యం గురించి వెలుగులోకి వచ్చింది.   

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని సేలం జిల్లా ఆత్తూర్‌ లో నటరాజన్(76) ఓ బైక్ షోరూం నడుపుతున్నాడు. ఇతడి ఇంట్లో ఓ మహిళతో పాటు ఆమె మేనకోడలైన 16 ఏళ్ల బాలిక పనిచేస్తోంది. అయితే ఆ బాలికపై నటరాజన్ కన్ను పడింది. ఎలాగైనా బాలికను అనుభవించాలని ప్లాన్ వేశాడు. 

ఇందులో భాగంగా ఇంట్లో కుటుంబసభ్యులెవరూ లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని బెదిరించడంతో బాలిక మౌనంగా ఉండిపోయింది.

అయితే ఇటీవల బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో పాటు తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. దీంతో హాస్పిటల్ కు తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు గట్టిగా ప్రశ్నించడంతో బాలిక జరిగిన విషయాన్ని వారికి తెలిపింది. 

దీంతో ఈ అఘాయిత్యంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు నటరాజ్ ను అరెస్ట్ చేశారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Sri Sathya Sai University: దేశంలోనే తొలిసారి 138 మంది రైతులకు ‘కృషి - ఋషి’ పట్టాలు.. హిస్టరీ క్రియేట్ శ్రీ సత్యసాయి యూనివర్శిటీ
సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People