నటుడి ఫాంహౌజ్ లో పదేళ్ల బాలికపై అత్యాచారం.. బెదిరించి, పదే పదే.... దారుణం...

Published : Sep 20, 2021, 04:36 PM IST
నటుడి ఫాంహౌజ్ లో పదేళ్ల బాలికపై అత్యాచారం.. బెదిరించి, పదే పదే.... దారుణం...

సారాంశం

టీ నరసీపుర తాలూకా కెంపయ్యనహుండిలోని ఈ ఫాంహౌస్ లో శివమొగ్గకు చెందిన దంపతులు కూలీలుగా పనిచేస్తున్నారు. వీరితో పాటు ఉంటున్న పదేళ్ల కుమార్తెపై అక్కడ పనిచేస్తున్న నిజాం అనే యువకుడు ఈ నెల 16న అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆ తరువాత పలుమార్లు బెదిరించి బాలికమీద ఇతను అత్యాచారానికి పాల్పడ్డాడు. 

కర్ణాటక : రాజనగరి మైసూరులో అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ కన్నడ సినీనటుడికి చెందిన ఫాంహౌస్ లో పదేళ్ల బాలికమీద అత్యాచారం జరిగినట్టు శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 16న ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఫాం హౌస్ లో పనిచేసే శివమొగ్గ జిల్లాకు చెందిన కార్మికుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు వెల్లడించారు. 

టీ నరసీపుర తాలూకా కెంపయ్యనహుండిలోని ఈ ఫాంహౌస్ లో శివమొగ్గకు చెందిన దంపతులు కూలీలుగా పనిచేస్తున్నారు. వీరితో పాటు ఉంటున్న పదేళ్ల కుమార్తెపై అక్కడ పనిచేస్తున్న నిజాం అనే యువకుడు ఈ నెల 16న అత్యాచారానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆ తరువాత పలుమార్లు బెదిరించి బాలికమీద ఇతను అత్యాచారానికి పాల్పడ్డాడు. 

మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులు.. ఎదురించినందుకు దాడి చేసి..!

చివరికి ఈ దారుణాన్ని గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైసూరు మహిళా పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు కేసు దాఖలైంది. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపామని జిల్లా ఎస్పీ ఆర్ చేతన్ వెల్లడించారు. 

కాగా మూడేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన 74 యేళ్ల వృద్ధుడిని అరెస్ట్ చేసిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా దాండేలిలో జరిగింది. అఫ్జల్ ఉస్మాన్ సయ్యద్ (74), బాలికకు చాకొలెట్ ఆశచూపి లైంగిక వేధింపులకు పాల్పడినట్టు వెలుగు చూసింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

PM Narendra Modi: మసాలా చాట్ టేస్ట్ చేసి పిల్లలకు పంచిన ప్రధాని మోదీ| Asianet News Telugu
Akshaya Tritiya Gold buying: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం గ్రాము ఎంతో తెలుసా?| Asianet News Telugu