కన్నతల్లిని చంపేసిన మైనర్ కూతురు.. ప్రియుడితో కలిసి రాత్రంతా శవం పక్కనే పడుకుంది..

Published : Jan 02, 2023, 12:47 PM IST
కన్నతల్లిని చంపేసిన మైనర్ కూతురు.. ప్రియుడితో కలిసి రాత్రంతా శవం పక్కనే పడుకుంది..

సారాంశం

తన ప్రేమకు అడ్డుగా ఉందని కన్నతల్లినే కర్కశంగా హతమార్చిందో పదిహేడేళ్ల అమ్మాయి. ఆ తరువాత ఆ రాత్రంతా ప్రియుడితో కలిసి శవం పక్కనే పడుకుంది. 

మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో దారుణ ఘటన వెలుగుచూసింది. 2022 చివరిరోజైన డిసెంబర్ 31న ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఓ మైనర్ అమ్మాయి తన తల్లినే దారుణంగా హతమార్చింది. తన ప్రేమకు అడ్డుగా ఉందని ఇంత అఘాయిత్యానికి ఒడిగట్టింది. ప్రేమను ఒద్దన్నదని తల్లిపై ద్వేషం పెంచుకున్న కూతురు.. ప్రియుడితో కలిసి కన్నతల్లినే కర్కశంగా హతమార్చింది. ఆ తరువాత రాత్రంతా ప్రియుడితో కలిసి.. తల్లి మృతదేహం పక్కనే నిద్రపోయింది. 

ఆ తరువాత ఉదయం లేచి.. ఇద్దరూ ఇంటినుంచి పారిపోయారు. తల్లి చనిపోయిన విషయం తెలిసిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెడితే.. గ్వాలియర్ లోని హజీరా ప్రాంతంలో ఉండే మమతా కుష్వాహా (45) సింగిల్ పేరెంట్.

బీజేపీ ఎమ్మెల్యే పేరు నోట్ లో రాసి సూసైడ్ చేసుకున్న బెంగళూరు వాసి.. ఎందుకంటే ?

తన మైనర్ కూతురుతో కలిసి ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది. కాగా, శనివారం పొద్దున్నుంచి మమతగానీ, ఆమె కూతురు కానీ కనిపించలేదు. ఎప్పుడూ మమతనో, ఆమె కూతురో కనిపిస్తుండేవాళ్లు. దీంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చింది. తలుపులు తట్టి చూశాడు. తీసే ఉన్నాయి. దీంతో గదిలోకి వెళ్లి చూశాడు. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. 

మంచం కింద రక్తపు మరకలతో ఉన్న దుప్పటి కనిపించేసరికి భయం వేసింది. ఏదో జరిగిందన్న అనుమానంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి.. రక్తపు మరకల దుప్పటి తీసి చూడగా.. అందులో మమత మృతదేహం చుట్టి కనిపించింది. మమత గొంతు, శరీరం మీద కత్తి గాట్లున్నాయి. కూతురు కోసం వెతికితే కనిపించలేదు. 

దీంతో అనుమానించిన పోలీసులు.. కూతురు కోసం గాలించగా, ఆమెతో పాటు ప్రియుడు కూడా కొద్ది గంటల్లోనే పట్టుబడ్డారు. తల్లిని దారుణంగా చంపిన కూతురు సోనూ అనే వ్యక్తిలో ప్రేమలో పడింది. అయితే సోనూకు నేర చరిత్ర ఉంది. మైనర్ మీద అత్యాచారం చేసినందుకు జైలుకు వెళ్లాడు. 15 రోజుల క్రితమే విడుదలయ్యాడు. అలాంటి వ్యక్తితో కూతురు ప్రేమలో పడడం మమతకు నచ్చలేదు. వద్దని చెప్పింది. 

అయితే, కూతురు మమత మాట లెక్కపెట్టలేదు. మళ్లీ అతడితో కలవడం మొదలుపెట్టింది. దీంతో కలవద్దని తీవ్రంగా మందలించింది అది కూతురుకు కోపం తెప్పించింది. తల్లి ఉంటే ప్రియుడిని కలవనివ్వదనుకుంది. అందుకే చంపేయాలనుకుంది. ప్రియుడితో కలిసి మాస్టర్ ప్లాన్ వేసింది. దాని ప్రకారం మమతను చంపేసి.. ఇద్దరూ కలిసి పారిపోయారు. కానీ పోలీసులు చాకచక్యంతో ఇద్దరూ పట్టుబడ్డారు. 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !