బంధువుతో ప్రేమలో మైనర్ బాలిక.. గర్భం దాల్చిన విషయం తెలిసి తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళితే..

Published : Apr 09, 2023, 04:48 PM ISTUpdated : Apr 09, 2023, 04:57 PM IST
బంధువుతో ప్రేమలో మైనర్ బాలిక.. గర్భం దాల్చిన విషయం తెలిసి తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళితే..

సారాంశం

ఓ 17 ఏళ్ల బాలిక వారి బంధువుల్లో ఒక్కరితో ప్రేమలో ఉంది. ఈ క్రమంలోనే అతడి ద్వారా గర్భం దాల్చింది. అయితే ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు.. ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి గర్భం తొలగించాలని చూశారు. 

సేలం: తమిళనాడులోని సేలంలో ఓ 17 ఏళ్ల బాలిక వారి బంధువుల్లో ఒక్కరితో ప్రేమలో ఉంది. ఈ క్రమంలోనే అతడి ద్వారా గర్భం దాల్చింది. అయితే ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు.. ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి గర్భం తొలగించాలని చూశారు. అయితే అక్కడ వైద్యురాలు బలవంతపు ప్రసవం కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలోనే నెలలు నిండకుండానే ఆడబిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక.. ప్రసవం తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తి మృతి చెందింది.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు శనివారం రాత్రి వైద్యురాలను అరెస్టు చేశారు.

వివరాలు.. సేలంలోని వజాపాడికి చెందిన మైనర్ బాలిక వారి బంధువుల్లో ఒకరితో ప్రేమలో ఉంది. అతడి ద్వారా గర్భం దాల్చింది. అయితే ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా దాచిపెట్టింది. ఏప్రిల్ 6వ తేదీన బాలిక గర్భం దాల్చిన విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసిందే. దీంతో గర్భం తొలగించడానికి బాలికను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యురాలు సెల్వాంబ రాజ్‌కుమార్‌ సంప్రదించారు. పూర్తిగా పెరిగిన పిండం అబార్షన్ చేయలేక పోవడంతో.. పిండాన్ని బయటకు తీసేందుకు యత్నించారు.

బాలికకు ప్రసవ నొప్పిని ప్రేరేపించడానికి మందులు ఇచ్చిన తర్వాత ఆమె అదే రోజు రాత్రి సాధారణ ప్రసవం చేసింది. బాలిక నెలలు నిండకుండానే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ అయిన వెంటనే, ఆమెకు తీవ్ర రక్తస్రావం మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. ఆమెను సేలం నగరంలోని ప్రభుత్వ మోహన్ కుమారమంగళం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కి తరలించారు, అక్కడి వైద్యులు బాలిక చనిపోయినట్లు ప్రకటించారు.

మరోవైపు బాలిక జన్మనిచ్చిన శిశువును స్వీకరించడానికి ఆమె తల్లిదండ్రులు నిరాకరించడంతో.. డాక్టర్ నవజాత శిశువును డబ్బాలో పడేశారు. అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత అప్రమత్తమైన పోలీసులు శిశువును రక్షించి.. ఇంక్యుబేటర్‌లో ఉంచి జీఎంకేఎంసీహెచ్‌కు తరలించారు. శిశువు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై సమాచారం మేరకు మెడికల్ అండ్ రూరల్ హెల్త్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఎం వలర్మతి, వాజపాడి ప్రభుత్వ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ జయసెల్వి నేతృత్వంలోని వైద్యుల బృందం శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రి, డాక్టర్ సెల్వాంబపై విచారణ జరిపారు. “మైనర్ బాలికకు అనస్థీషియా ఇవ్వలేదని, బాలికను రక్షించడానికి డాక్టర్ ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని వారు కనుగొన్నారు. బాలిక మైనర్ అని వైద్యుడికి తెలిసి కూడా పోలీసులకు లేదా ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇవ్వలేదని వారు గుర్తించారు. వారి నివేదిక ఆధారంగా.. మేము భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద సెల్వాంబపై కేసు నమోదు చేసాము’’ అని పోలీసులు తెలిపారు. సెల్వాంబ‌ను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. బాలికను గర్భం దాల్చేందుకు కారణమైన యువకుడిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Viral News: పెరుగుతోన్న విడాకులు.. ఇకపై పెళ్లిళ్లు చేయకూడదని పండితుల నిర్ణయం