Earthquake: ఉలిక్కిపడ్డ అండమాన్ నికోబార్.. భారీ భూ ప్రకంపనాలతో జనం పరుగులు.. 

Published : Apr 09, 2023, 04:35 PM IST
Earthquake: ఉలిక్కిపడ్డ అండమాన్ నికోబార్.. భారీ భూ ప్రకంపనాలతో జనం పరుగులు.. 

సారాంశం

Earthquake: భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవిలో ఆదివారం మధ్యాహ్నం 2:59 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది

Earthquake: భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో ఆదివారం భూకంపం సంభవించింది. నికోబార్ దీవుల్లో మధ్యాహ్నం 2:59 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా నష్టం జరిగినట్లు నివేదిక లేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. భూకంపం 10 కి.మీ లోతులో సంభవించింది.

ఈ వారం ప్రారంభంలో ఏప్రిల్ 6 న అండమాన్ మరియు నికోబార్ దీవులలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.6గా నమోదైంది. పోర్ట్ బ్లెయిర్‌కు 140 కి.మీ దూరంలో భూకంపం సంభవించింది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

అంతముందుకు .. నేపాల్ దేశ రాజధాని నగరమైన ఖట్మండ్ లో శనివారం తెల్లవారుజామున 3.04 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. 25కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదైందని అధికారులు ప్రకటించారు. గత రెండు నెల కిత్రం (ఫిబ్రవరి)లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. గతంలో సంభవించిన భూకంపం వల్ల నేపాల్ దేశంలో భారీ నష్టం సంభవించింది.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం