రోడ్డుపై ఒంటరిగా తిరుగుతున్న మైనర్ బాలిక.. పోలీసులు ఆరా తీయడంతో...!

Published : Nov 04, 2022, 11:34 AM IST
రోడ్డుపై ఒంటరిగా తిరుగుతున్న మైనర్ బాలిక.. పోలీసులు ఆరా తీయడంతో...!

సారాంశం

 తన తల్లిదండ్రులు చనిపోయారని.. తాను అనాథ అంటూ నమ్మించింది. కానీ తర్వాత అసలు విషయం తెలిసి పోలీసులు షాకయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మైనర్ బాలిక రోడ్డుపై ఒంటరిగా తిరుగుతూ పోలీసుల కంట పడింది. ఏమైందా అని బాలికను పోలీసులు ఆరా తీయగా... ఆమె చెప్పిన కథ విని పోలీసులకు షాకయ్యారు. అయ్యో పాపం అనుకునేలోపు బాలిక మరో ట్విస్ట్ ఇచ్చింది. తన తల్లిదండ్రులు చనిపోయారని.. తాను అనాథ అంటూ నమ్మించింది. కానీ తర్వాత అసలు విషయం తెలిసి పోలీసులు షాకయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని  భేతుల్ వీధుల్లో  ఇటీవల ఓ 14ఏళ్ల బాలిక ఒంటరిగా తిరుగుతూ కనిపించింది. కొందరు సామాజిక కార్యకర్తలు గమనించి పోలీసులకు అప్పగించారు. బాలికను పోలీసులు ఎవరు నువ్వు అని ఆరా తీయగా తాను అనాథ అని చెప్పింది. తన తల్లిదండ్రులు కరోనా సెకండ్ వేవ్ లో చనిపోయారని.. తన అమ్మమ్మ తను పోషించలేకపోయింది అని చెప్పింది. కొంత కాలం తనను తన తల్లి స్నేహితురాలికి దగ్గరకు పంపించిందని.... అయితే... వారు కూడా తనను పోషించలేకపోయారని అందుకే.. అక్కడి నుంచి వచ్చేసినట్లు ఆమె చెప్పారు. ఆమె చెప్పిన దానిని విని పోలీసుల మనుసు కూడా కరిగిపోయింది. బాలికను  వెంటనే అనాథాశ్రమానికి పంపించాలని అనుకున్నారు. అయితే.. ఎందుకైనా మంచిదని.. సెకండ్ వేవ్ లో  చనిపోయినవారి లిస్ట్ తీశారు. అందులో... బాలిక తల్లిదండ్రులు లేకపోవడంతో.. పోలీసులకు అనుమానం కలిగింది.

అంతలోనే సదరు బాలిక తండ్రి, సోదరి పోలీస్ స్టేషన్ కి రావడం గమనార్హం. తమ కూతురు ఇలా ఎందుకు చేసిందో తమకు తెలీదని వారు చెప్పడం గమనార్హం. సోమవారం తమ కూతురు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిందని.. వెతుకుతూ... స్టేషన్ లో ఉందని సమాచారం తెలిసి ఇక్కడకు వచ్చామని వారు చెప్పడం గమనార్హం. బాలికను తండ్రితో తిరిగి పంపించినట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం