తల్లి టీవీ చూడొద్దందని.. అలిగి పన్నెండేళ్ల కూతురు ఆత్మహత్య...

Published : Jun 04, 2022, 11:13 AM IST
తల్లి టీవీ చూడొద్దందని.. అలిగి పన్నెండేళ్ల కూతురు ఆత్మహత్య...

సారాంశం

తమిళనాడులోని చెన్నైలో  విషాదం చోటు చేసుకుంది. తల్లి టీవీ చూడొద్దన్నందుకు అలిగి ఓ పన్నెండేళ్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. 

చెన్నై : స్థానిక మాధవరంలో ఎక్కువసేపు TV చూస్తూందని తల్లి మందలించడంతో ఏడో తరగతి బాలిక suicideకు పాల్పడింది. మాధవరం తెలుగు కాలనీకి చెందిన నాగరాజు చెన్నై కార్పొరేషన్ మాధవరం మండలంలో Sanitation workerగా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె ఏంజెల్ (12) మాధవరం ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. ఏంజల్ ఇంట్లో ఎక్కువ సమయం టీవీ చూస్తూ ఉండటంతో, తల్లి కుమార్తెను మందలించింది. దీంతో మనస్తాపం చెందిన ఏంజెల్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మాధవరం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

ఇదిలా ఉండగా, maharasthra లోని పుణెలో దిగ్బ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఆడుకునే బొమ్మకు ఉరివేసిన ఎనిమిదేళ్ల బాలుడు ఆ తరువాత తాను కూడా ప్రాణం తీసుకున్నాడు. వస్త్రాన్ని ముఖంమీద కప్పుకుని ఊపిరాడకుండా చేసుకుని చనిపోయాడు. పింప్రీ చించ్వడ్ లోని తేర్ గావ్ లో రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. బొమ్మతో ఆడుకుంటున్న సమయంలో ఎనిమిదేళ్ల బాలుడు దానికి ఉరివేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తరువాత అది చనిపోయిందనుకుని.. తాను కూడా ముఖం మీద బట్ట కప్పుకుని ఊపిరాడకుండా చేసుకుని చనిపోయాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు కంగు తిన్నారు. ఫోన్ లో ఓ హారర్ వీడియోను అనుకరించడం వల్లే బాలుడు ఇలా చేశాడని తెలిపారు. బాలుడి తల్లి వేరే పనిలో ఉండగా ఈ ఘటన జరిగిందని అంటున్నారు. 

కాగా, ఫిబ్రవరి 15న తెలంగాణలోని..  jagtial జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సినిమా టికెట్ కు డబ్బులు ఇవ్వలేదని ఓ స్కూల్ విద్యార్థి suicide చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నవదీప్ (11) అనే బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు. Bhimla Nayak సినిమా కోసం తన మిత్రులు ముందుగానే tickets Bookచేసుకుంటున్నారని తనకి కూడా రూ.300 కావాలని తండ్రిని నవదీప్ అడిగాడు. అందుకు తండ్రి నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన నవదీప్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విద్యార్థి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

కాగా, 2020 డిసెంబర్ 5న ఇలాంటి ఘటనే జరిగింది. చిన్న చిన్న విషయాలకే జీవితాన్ని అంతం చేసుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు తల్లిదండ్రులు కొప్పడితే చాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే ముంబైలో జరిగింది. టీవీ చూడనివ్వడం లేదనే కోపంతో 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పింప్రి చించ్‌వడ్‌లోని చిఖలీ ప్రాంతంలో జరిగింది. వివరాల ప్రకారం, రంజాన్‌ అబ్దుల్‌ శస్త్రక్‌ (13) ఎప్పుడూ టీవీ చూస్తుండటంతో వాళ్ల అమ్మ తిడుతూ ఉండేది. 

ఆ రోజు కూడా అలాగే కొప్పడింది. దీంతో మనస్థాపానికి గురైన అబ్దుల్‌ మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు .గమనించిన కుటుంబసభ్యులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. బుధవారం రంజాన్‌ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం మరో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో రంజాన్‌ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !