ఢిల్లీ ఎయిమ్స్ లో స్వల్ప అగ్నిప్రమాదం.. !

By AN TeluguFirst Published Jun 28, 2021, 12:46 PM IST
Highlights

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మెయిన్ ఎమర్జెన్సీ వార్డులో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదం చాలా చిన్నదని అధికారులు తెలిపారు. 

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మెయిన్ ఎమర్జెన్సీ వార్డులో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదం చాలా చిన్నదని అధికారులు తెలిపారు. 

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన మంటలను గంటలో అదుపులోకి తెచ్చినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. రోగులందరినీ బాధిత ప్రాంతాల నుంచి సురక్షితంగా తరలించారు. 

ప్రమాద ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రిలోని డమ్మీ గదిలో మంటలు, పొగ కనిపించింది. రోగులందరినీ ప్రమాద ప్రాంతంనుంచి తరలించారు. ఏడు ఫైర్ ఇంజన్ లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశాయి. పరిస్థితి ఇప్పుడు అదుపులోనే ఉందని డీసీసీ సౌత్ అతుల్ ఠాకూర్ వెల్లడించారు. 

ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ రూమ్ ప్రాంతానికి కూడా ఈ మంటలు వ్యాపించాయి. అయితే అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.

ఒక వారం క్రితం, ఆసుపత్రిలోని డయాగ్నొస్టిక్ లాబరేటరీ, ఎగ్జామినేషన్ సెంటర్ లు ఉన్న కన్వర్జెన్స్ బ్లాక్‌లోని తొమ్మిదవ అంతస్తులో మంటలు చెలరేగాయి. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. సమాయానికి గమనించడంతో ఆ ఫ్లోర్ ఖాళీ చేయించారు. అప్పుడు తొమ్మిదవ అంతస్తులో ఉన్న రిఫ్రిజిరేటర్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

click me!