
స్త్రీలను గౌరవించాలని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకూడదని ప్రభుత్వాలు ఎంత చెప్పినా..
మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా.. మృగాళ్లలో స్త్రీల పట్ల ఆ అనుచిత ధోరణి మారడం లేదు. అవేవి తమకు పట్టవన్నానట్టు రెచ్చిపోతూనే ఉన్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట చిన్నారులపై, మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడవాళ్లు ఒంటరిగా కనిపిస్తే చాలు.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా.. విచక్షణ మరిచి.. అఘాయిత్యాలకు పాల్పడుతూ.. తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో దారుణ ఘటన చోటు చేసుకున్నాయి. పిలిభిత్‌లో 24 గంటల్లోనే ఇద్దరు సామూహిక అత్యాచారానికి బలికావడంతో పోలీసు శాఖలో కలకలం రేపింది.
మొదట కేసులో 16 ఏళ్ల దళిత బాలిక ఇంట్లో ప్రవేశించి.. సామూహిక అత్యాచారం చేసి, ఆపై డీజిల్ పోసి నిప్పంటించారు. తీవ్రగాయాలపాలైన బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరు వ్యక్తులపై సామూహిక అత్యాచారం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. బాలిక వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ కూడా నమోదు చేశారు.
16 ఏండ్ల దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి నిప్పంటించారని పోలీసులు తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దినేష్ కుమార్ ప్రభు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని, నిందితులు మొదట బాలికపై అత్యాచారం చేసి, ఆపై డీజిల్ పోసి నిప్పంటించి చంపడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన సెప్టెంబర్ 7వ తేదీన జిల్లాలోని మాధవ్ తండాలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే, బాధితురాలు తనకు ఎదురైన కష్టాలను వివరిస్తున్న వీడియో శనివారం వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాలిన గాయాలతో ఉన్న బాలికను సెప్టెంబర్ 7న ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులపై పోక్సో చట్టం, షెడ్యూల్ కులాలు/ షెడ్యూల్డ్ తెగల చట్టం కింద శనివారం రాత్రి కేసు నమోదు చేసినట్లు ఎస్పీ దినేష్ కుమార్ ప్రభు తెలిపారు. ఈ విషయమై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని, అరెస్టు చేసిన నిందితులిద్దరినీ విచారిస్తున్నామని తెలిపారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (సదర్) యోగేష్ కుమార్ మైనర్ బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.
రెండో ఘటనలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని రాత్రి ఇంటి నుంచి ఎత్తుకెళ్లి.. సమీపంలోని అడవి పాంత్రంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. గ్రామంలో ఉంటున్న ఇద్దరు యువకులు తనను రాత్రి సమయంలో ఇంటి నుంచి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి తల్లి ఉదయం తన కుమార్తె ఇంట్లో లేకపోవడంతో ఆమె కోసం వెతకగా చెరుకు తోటలో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు
గమనించారు.
అనంతరం కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రధాన నిందితుడి సహచరుడిని అదుపులోకి తీసుకున్నామని, ఇతర నిందితులను అరెస్టు చేయడానికి పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ దినేష్ పి తెలిపారు. త్వరలో నిందితులను అరెస్టు చేయనున్నట్టు తెలిపారు. 24 గంటల్లోనే పిలిభిత్‌లో జరిగిన ఇద్దరు సామూహిక అత్యాచార ఘటనలు జరగడంతో బాలికల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.