
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం(Karnataka Hijab Row) పరిణామాలు తీవ్రంగా మారేలా ఉన్నాయి. ఈ వివాదం మరింత పెరిగి కార్చిచ్చులా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడే ముప్పు ఉన్నట్టు తెలుస్తున్నది. హిజాబ్ ధరించడం తమ హక్కు అంటూ నిరసన చేస్తున్న ఉడిపిలోని కాలేజీకి చెందిన ఆరుగురు ముస్లిం విద్యార్థినుల(Musilm Girls) ఫోన్ నెంబర్లు(Phone Numbers) కొందరు దుండగులు సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు వారి తల్లిదండ్రులు వాపోయారు. ఈ విషయం తెలియగానే ఆ తల్లిదండ్రులు(Parents) పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొంత మంది తమ పిల్లల ఫోన్ నెంబర్లు, వారి వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశారని తల్లిదండ్రులు ఉడిపి ఎస్పీ ఎన్ విష్ణువర్ధన్‌కు ఫిర్యాదు చేశారు. పబ్లిక్ డొమైన్‌లోకి తమ పిల్లల వ్యక్తిగత వివరాలను షేర్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదును సమర్పించారు. ఆ వ్యక్తిగత వివరాల ఆధారంగా తమ పిల్లలను బెదిరించే, వేధించే ముప్పు ఉన్నదని ఆందోళనల పడుతున్నట్టు వారు అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎస్పీ ఎన్ విష్ణువర్ధన్ ధ్రువీకరించారు. విద్యార్థినుల తల్లిదండ్రులు తమకు రాతపూర్వక ఫిర్యాదును సమర్పించినట్టు తెలిపారు. ఆన్‌లైన్‌లో వెల్లడించిన వివరాలకు సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సమర్పించాలని కోరినట్టు వివరించారు. ఈ సమాచారం వారి నుంచి తీసుకున్న తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కర్ణాటకలో హిజాబ్ వివాదం తొలిసారి ఉడిపిలో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ ఉడిపిలోని ఓ ప్రి యూనివర్సిటీ కాలేజీకి చెందిన ఆరుగురు ముస్లిం విద్యార్థినుల వివరాలనే సోషల్ మీడియాలో షేర్ చేశారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ విద్యార్థినులు హిజాబ్ ధరించడం తమ హక్కు అంటూ ఆందోళనలు చేశారని పేర్కొన్నారు.
హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు గురువారం నాడు మధ్యంతర తీర్పు వెలువరించింది. కళాశాలల్లో విద్యార్థులు 'హిజాబ్' ధరించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కర్ణాటక హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారించింది. అయితే వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు ఏ విద్యార్థి కూడా మతపరమైన దుస్తులు ధరించాలని పట్టుబట్టకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది. అనంతరం విచారణను సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది కోర్ట్. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా విచారించి ముస్లిం విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని కోరారు. కానీ, ఈ పిటిషన్ అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు.సరైన సమయంలో ఈ పిటిషన్ ను విచారిస్తామని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. Schools,College హిజాబ్ ఆంక్షలకు సంబంధించిన విషయమై నిర్ణయం తీసుకొనే వరకు మతపరమైన దుస్తులు ధరించవద్దని కర్ణాటక హైకోర్టు గురువారం నాడు తీర్పును వెల్లడించింది. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు
పిటిషనర్. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఎస్ఎల్‌పీ దాఖలు చేశారు సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది. అయితే ఈ కేసును అత్యవసరంగా విచారణగా చేయాల్సిన అవసరం లేదని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ కేసుపై అత్యవసర విచారణను తిరస్కరించింది సుప్రీంకోర్టు. అయితే ఈ విషయమై కర్ణాటక హైకోర్టు నిర్ణయం ముందుగా తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం పిటిషనర్ కు సూచించింది.