వరుసగా నలుగురు ఆడపిల్లలే పుట్టారని.. భార్య గొంతు నులిమి హత్య...

Published : May 14, 2021, 04:53 PM IST
వరుసగా నలుగురు ఆడపిల్లలే పుట్టారని.. భార్య గొంతు నులిమి హత్య...

సారాంశం

భోపాల్ లో దారుణ ఘటన జరిగింది. వరుసగా ఆడపిల్లలకు జన్మనిస్తుందని కోడలిని దారుణంగా హత్య చేశారు అత్తామామలు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

భోపాల్ లో దారుణ ఘటన జరిగింది. వరుసగా ఆడపిల్లలకు జన్మనిస్తుందని కోడలిని దారుణంగా హత్య చేశారు అత్తామామలు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

ప్రతి కాన్పులో ఆడపిల్లలనే కంటోందని.. ఒక్క మగ పిల్లాడిని కూడా ఇవ్వడంలేదని అత్తామామలు కోడలిని తీవ్రంగా వేధించడం మొదలుపెట్టారు. అంతేకాదు ఈ కారణంతో కోడలిని అత్యంత దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెడితే.. 

శివపురి జిల్లా దిండోలి గ్రామానికి చెందిన సావిత్రి భగేల్, రతన్ సింగ్ భార్యభర్తలు. వీరికి వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. ఇటీవల సావిత్రి నాలుగో కాన్పులో కూడా ఆడపిల్లకే జన్మనిచ్చింది. దీంతో భర్త రతన్ సింగ్, అతడి తల్లిదండ్రులు కిలోల్డ్ సింగ్, బేను భాయ్ తీవ్రంగా వేధించడం మొదలుపెట్టారు. 

ఆడపిల్లల్నే కంటుందని తీవ్రంగా దూషిస్తూ దాడి చేస్తుండేవారు. తాజాగా నాలుగో బిడ్డ కూడా ఆడపిల్ల కావడంతో సావిత్రిని గురువారం భర్తతో పాటు అత్తామామ ఆమె గొంతు నులిమి హత్య చేశారు. 

తన సోదరి మృతి చెందడం మీద సావిత్రి సోదరుడు కృష్ణ భగేల్ అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అత్తామామలు, భర్తను గట్టిగా మందలించగా వారు చేసిన అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. 

దీంతో రతన్‌సింగ్‌, కిలోల్డ్‌ సింగ్‌, బేను భాయ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లైనప్పటినుంచి అదనపు కట్నం కోసం తన సోదరిని వేదించేవాడని కూడా కృష్ణ భగేల్ పోలీసులకు చెప్పాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu