పద్నాలుగేళ్ల బాలికను రెచ్చగొట్టి.. దుస్తులు విప్పించి.. వీడియోతీసి..

By AN TeluguFirst Published Feb 8, 2021, 12:22 PM IST
Highlights

ఇంటర్నెట్ ఎలాంటి విపరీతపోకడలకు దారి తీస్తుందో తెలిపే సంఘటన ఒకటి ఇటీవల ముంబైలో జరిగింది. ఓ పదమూడేళ్ల బాలుడు.. పద్నాలుగేళ్ల తన స్నేహితురాలిని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆమెను రెచ్చగొట్టి.. దుస్తులు విప్పేలా చేసి.. అది వీడియో రికార్డ్ చేశాడు. ఇది బైటికి రావడంతో ఆ బాలుడి మీద పోలీస్ కేసు నమోదయ్యింది.

ఇంటర్నెట్ ఎలాంటి విపరీతపోకడలకు దారి తీస్తుందో తెలిపే సంఘటన ఒకటి ఇటీవల ముంబైలో జరిగింది. ఓ పదమూడేళ్ల బాలుడు.. పద్నాలుగేళ్ల తన స్నేహితురాలిని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆమెను రెచ్చగొట్టి.. దుస్తులు విప్పేలా చేసి.. అది వీడియో రికార్డ్ చేశాడు. ఇది బైటికి రావడంతో ఆ బాలుడి మీద పోలీస్ కేసు నమోదయ్యింది.

వివరాల్లోకి వెడితే ముంబైకి చెందిన ఓ బాలుడు లాక్ డౌన్ టైంలో ఇన్‌స్టాగ్రామ్ లో ఓ 14 ఏళ్ల బాలికతో పరిచయం చేసుకున్నాడు. మెల్లగా ఆమెతో స్నేహం పెంచుకున్నాడు. చాటింగ్ తో మొదలై, వీడియో కాల్ వరకు వాళ్ల స్నేహం వెళ్లింది. అయితే ఈ బాలుడు ఏ టైంలోనూ తన వ్యక్తిగత వివరాలు బయటకు వెల్లడించలేదు.

వీడియో కాల్ లో ఓసారి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడారు. ఆమెకు డేర్ వచ్చింది. బాలుడు వెంటనే ఆ పిల్లను రెచ్చగొట్టాడు. నీకు ధైర్యం ఉంటే బట్టలు విప్పాలంటూ చాలెంజ్ విసిరాడు. ఆటలో భాగమేకదా అని ఆ బాలిక దుస్తులు తీసేసింది. వీటిని ఆ అమ్మాయికి తెలియకుండా రికార్డు చేశాడు. ఆ తరువాత...ఈ వీడియో సాయంతో ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. అలా చాలాసార్లు ఆమెతో వీడియో కాలింగ్‌లో దుస్తులు విప్పేలా చేశారు. 

పదే పదే ఇలా విసిగిస్తుండడంతో ఆ బాలిక అతడ్ని బ్లాక్ చేసింది. అయితే బాలిక స్నేహితురాలైన మరో అమ్మాయికి కొద్ది రోజుల క్రితం ఫాలో రిక్వస్ట్ పంపించాడు. అదే క్రమంలో గతంలో అతడు రికార్డు చేసిన బాలిక వీడియో కూడా పంపించాడు. దీంతో వెంటనే ఆందోళన చెందిన ఆ బాలిక బాధితురాలి కుటుంబాన్ని అప్రమత్తం చేసింది. విషయం తెలిసి వారు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. 

దీని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. బాధితురాలు, నిందితుడు ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుతున్నారని, బాలిక కంటే అతను ఏడాది చిన్నవాడని తెలిసి షాక్ అయ్యారు. 

దీనిమీద ఆ బాలుడికి నోటీసులు పంపడంతో పాటు విషయం, జరిగిన నేరం గురించి బాలుడి తల్లిదండ్రులకు తెలిపారు. ఈ కేసుపై బాలనేరస్తుల కోర్టులో త్వరలో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పిల్లల వ్యవహారశైలిపై ఓ కన్నేసి ఉంచాలంటూ సూచంచారు. 

click me!