తల్లిదండ్రులను గొడ్డలితో నరికి చంపిన కానిస్టేబుల్..!

Published : Feb 08, 2021, 12:01 PM IST
తల్లిదండ్రులను గొడ్డలితో నరికి చంపిన కానిస్టేబుల్..!

సారాంశం

వారి తలపై గొడ్డలితో మోదినట్లు గాయాలున్నాయని పేర్కొన్నారు. అలాగే దీపక్ గదిలో గొడ్డలి లభ్యమైంది. దానిపై రక్తం మరకలు ఉన్నాయని తెలిపారు. 

ఓ కానిస్టేబుల్ కన్న తల్లిదండ్రులను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపాడు.ఈ దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సదరు కానిస్టేబుల్ తల్లిదండ్రులను చంపిన తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఖర్‌ఖైదా పోలీస్‌స్టేషన్ ఎస్ హెచ్‌వో ఇన్‌స్పెక్టర్ బిజేంద్ర సింగ్ తెలియజేశారు. కానిస్టేబుల్ దీపక్(39) అతని ఇంటిలోని ఒక గదిలో అచేతనస్థితిలో కనిపించాడని, అలాగే అతని తల్లిదండ్రుల మృతదేహాలు కూడా అక్కడే లభ్యమయ్యాయని తెలిపారు. 

వారి వయసు 65 సంవత్సరాలు ఉండవచ్చని, వారి తలపై గొడ్డలితో మోదినట్లు గాయాలున్నాయని పేర్కొన్నారు. అలాగే దీపక్ గదిలో గొడ్డలి లభ్యమైంది. దానిపై రక్తం మరకలు ఉన్నాయని తెలిపారు. దీపక్ తన తల్లిదండ్రులను గొడ్డలితో నరికిన తరువాత వారిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. తరువాత తాను విషాహారం తిని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !