2015లోనే రద్దు.. అయినా ఇంకా కేసులు: ‘‘ సెక్షన్ 66 ఏ’’పై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం

By Siva KodatiFirst Published Jul 14, 2021, 7:33 PM IST
Highlights

ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం 2015లోనే తీర్పు వెలువరించింది. అయినప్పటికీ పలు రాష్ట్రాల్లో ఈ చట్టం కింద కేసులు నమోదవ్వడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది

కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెక్షన్ 66-a ఐటీ చట్టం కింద నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లుగా ప్రకటించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హోంశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల క్రితమే రద్దు చేసింది. అయితే రద్దు చేసినా కొన్ని రాష్ట్రాలు ఈ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం 2015లోనే తీర్పు వెలువరించింది. తీర్పు వెలువడి ఆరేళ్లు కావొస్తున్నా 66ఏ కింద పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంపై ఇటీవల సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. సుప్రీం తీర్పు వెలువరించిన 2015 తర్వాత 11 రాష్ట్రాల్లో 1307 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో అగ్రస్థానంలో వుంది. ఏపీ, తెలంగాణల్లో 50కి పైగా కేసులు ఈ చట్టం కింద నమోదైనట్లుగా సమాచారం. 

click me!