ఈవీఎంలను భద్రపర్చాలి: నందిగ్రామ్‌ రిజల్ట్స్ పై ఈసీకి కోల్‌కత్తా హైకోర్టు నోటీసులు

By narsimha lodeFirst Published Jul 14, 2021, 5:38 PM IST
Highlights

నందిగ్రామ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను, వీడియోలతో పాటు డాక్యుమెంట్లను భద్రపర్చాలని కోల్‌కత్తా హైకోర్టు ఈసీని ఆదేశించింది. నందిగ్రామ్ లో ఎన్నికల ఫలితాలను సవాల్  మమత బెనర్జీ సవాల్ చేసింది. ఈ పిటిషన్ పై ఇవాళ కోర్టు విచారించింది.  
 

కోల్‌కత్తా: నందిగ్రామ్ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు, పేపర్లు, వీడియోలను భద్రపర్చాలని  కోల్‌కత్తా హైకోర్టు ఈసీని ఆదేశించింది.నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో సీఎం మమత బెనర్జీపై బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి విజయం సాధించారు. తొలుత మమత బెనర్జీ విజయం సాధించినట్టుగా ప్రకటించిన అధికారులు ఆ తర్వాత సువేందు అధికారి విజయం సాధించినట్టుగా డిక్లేర్ చేశారు. 

సువేందు అధికారి గెలుపును సవాల్ చేస్తూ కోల్‌కత్తా హైకోర్టులో సీఎం మమత బెనర్జీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయమై ఆన్ లైన్ లో విచారణ నిర్వహించారు. ఈ విషయమై ఈసీ,  ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేస్తామని న్యాయమూర్తి జస్టిస్ షంపా తెలిపారు.సువేందు అధికారి నందిగ్రామ్ లో సీఎం మమత బెనర్జీని 1956 ఓట్ల తేడాతో ఒడించారని  ఎన్నికల సంఘం తెలిపింది. ఈసీ ప్రకటనను దీదీ హైకోర్టులో సవాల్ చేసింది.

తొలుత ఈ పిటిషన్ జస్టిస్ కౌసిక్ చందా వద్దకు వచ్చింది. అయితే ఈ పిటిషన్ పై చందా విచారించవద్దని  మమత కోరింది. దీంతో చందా ఈ పిటిషన్ పై విచారణను ఉపసంహరించుకొన్నారు. ఈ సమయంలో మమతకు రూ. 5 లక్షల జరిమానాను కూడ  చందా విధించారు.


 

click me!