దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రయాణాలకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. దీంతో దేశీయ ప్రయాణీలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం నాడు మార్గదర్శకాలను విడుదల చేసింది.
న్యూఢిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రయాణాలకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. దీంతో దేశీయ ప్రయాణీలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం నాడు మార్గదర్శకాలను విడుదల చేసింది.
లాక్ డౌన్ 4 గైడ్ లైన్స్ ఆంక్షలను సడలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. విమాన ప్రయాణాలను అనుమతించింది. రైళ్లను కూడ అనుమతించింది. రైల్వే టిక్కట్ల బుక్కింగ్ కూడ ప్రారంభమైంది.
ఆయా రాష్ట్రాల్లో ప్రజా రవాణా వ్యవస్థ కూడ ప్రారంభమైంది. మెట్రో రైళ్ల రాకపోకలు మాత్రం ఇంకా ప్రారంభించాల్సి ఉంది.రైళ్లు, విమానాల్లో ప్రయాణీకులు ప్రయాణాలు చేయనున్నారు. బస్సుల్లో కూడ ఇప్పటికే ప్రయాణీకులు తమ గమ్యస్థానాలకు చేరుకొంటున్నారు.
ప్రతి టిక్కెట్టు వెనుక ప్రయాణీకులకు సూచిస్తూ ముద్రించాలని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రయాణీకులు ఏంచేయాలి, ఏం చేయకూడదనే విషయాలను కచ్చితంగా ముద్రించాలని తేల్చి చెప్పింది.
రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, బస్టాండుల్లో కరోనా నివారణకు తీసుకొంటున్న విధి విధానాలను కచ్చితంగా పాటించాలని కేంద్రం సూచించింది.ప్రతి ప్రయాణికుడిని థర్మల్ స్క్రీనింగ్ చేయాలని కోరింది. కరోనా లక్షణాలు లేకపోతేనే ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది.
also read:లాక్‌డౌన్ మే 31తో ముగుస్తుందని చెప్పలేం, రానున్న రోజుల్లో మరిన్ని జాగ్రత్తలు: సీఎం
స్టార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరు కూడ ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.ప్రయాణీకులు ప్రయాణ సమయంలో ఫేస్ మాస్కును ధరించాల్సిందే. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించింది.
రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో ప్రయాణీకులు భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరింది.విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లను తరచుగా శానిటేషన్ చేయాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది.
ప్రయాణం ముగించుకొని వెళ్లే ప్రయాణీకులకు కూడ పరీక్షలు నిర్వహించాలని సూచించింది కేంద్రం.కరోనా లక్షణాలు ఉంటే సమీపంలోని హోం క్వారంటైన్ లేదా ఐసోలేషన్ వార్డుకు తరలించాలని సూచించింది ఆరోగ్య శాఖ.కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా కూడ వారం రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉంచాలని కేంద్రం ఆదేశించింది.