అభినందన్ వీడియోలు తీసేయ్యండి: యూట్యూబ్‌కు భారత్‌ హుకుం

By Siva KodatiFirst Published Feb 28, 2019, 5:47 PM IST
Highlights

పాకిస్తాన్ చేతికి చిక్కిన ఇండియన్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ వీడియోలను వెంటనే డిలీట్ చేయాల్సిందిగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్‌కు ఆదేశాలు జారీ చేసింది.

పాకిస్తాన్ చేతికి చిక్కిన ఇండియన్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ వీడియోలను వెంటనే డిలీట్ చేయాల్సిందిగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ యూట్యూబ్‌కు ఆదేశాలు జారీ చేసింది.

విమానం కూలిపోయిన తర్వాత వర్థమాన్ పారాచ్యూట్ సాయంతో కిందకు దిగారు. అయితే ఆయన పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో అడుగుపెట్టారు. దీంతో ఆయన్ను పట్టుకున్న స్థానికులు తీవ్రంగా కొడుతున్నట్లు... ఆ తర్వాత పాక్ సైనికాధికారుల సమక్షంలో టీ తాగుతున్న అభినందన్ వీడియోలు యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

దేశ ప్రజల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో దీనిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పందించింది. వర్థమాన్‌కు సంబంధించిన 11 వీడియోలను డిలీట్ చేయాల్సిందిగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సూచించింది.

హోంశాఖ సూచనల మేరకు సమాచార శాఖ యూట్యూబ్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు యూట్యూబ్ సంస్ఠ ప్రతినిధి స్పందిస్తూ...‘‘ ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము వీడియోలను తొలగించి... గూగుల్ సర్వీస్‌ను అప్‌డేట్ చేశామని తెలిపారు.  
 

click me!