యుద్ధం వద్దు.. చర్చలే బెస్ట్.. అమరవీరుడి భార్య

By ramya NFirst Published Feb 28, 2019, 4:17 PM IST
Highlights

భారత్-పాక్ ల మధ్య యుద్ధం వద్దని.. చర్చలు జరపడమే బెస్ట్ అని పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన ఓ జవాను భార్య చెబుతోంది.

భారత్-పాక్ ల మధ్య యుద్ధం వద్దని.. చర్చలు జరపడమే బెస్ట్ అని పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన ఓ జవాను భార్య చెబుతోంది. ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో 43మందికిపైగా జవానులు అమరులైన సంగతి తెలిసిందే. కాగా.. దానికి ప్రతీకారంగా.. తాజాగా భారత్.. పాక్ స్థావరాలపై దాడులు చేశారు. దీనిపై వీర జవాను బబ్లూ సాంత్రా భార్య మితా సంత్రా స్పందించారు.

ఈ ఉద్రిక్తతలను తగ్గించండవి.. చర్చలు మొదలుపెట్టండి అని ఆమె భారత ప్రభుత్వాన్ని కోరింది. యుద్ధం వద్దే వద్దని ఆమె స్పష్టం చేసింది. అంతేకాదు ప్రస్తుతం పాక్ చెరలో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ ను కూడా సురక్షితంగా తిరిగి తీసుకురావాలని మోదీ సర్కార్ ని ఆమె కోరింది. 

యుద్ధం వద్దన్నందుకు తనపై సోషల్ మీడియాలో వచ్చే విమర్శల గురించి తాను ఆలోచించడం లేదని ఆమె స్పష్టం చేసింది. యుద్ధం జరిగితే.. ఇంకా చాలా మంది చనిపోయే ప్రమాదం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.  ప్రాణ నష్టంతోపాటు దేశానికి కూడా చాలా నష్టం జరుగుతుందన్నారు.  చాలా మంది ఇంట్లో కూర్చోని ట్రోల్స్ చేస్తుంటారని.. వాళ్ల ఇంట్లో ఎవరూ ఆర్మీలో పాల్గొనలేదు కదా అని ఆమె ప్రశ్నించారు. 

click me!