
Kumbh Mela 2025 : కేంద్ర మంత్రి ఎస్పి సింగ్ బఘేల్ మహాకుంభ్‌లో పవిత్ర స్నానం ఆచరించిన తర్వాత తన అనుభవాలను పంచుకున్నారు. ఇస్కాన్, అదానీ గ్రూప్ సేవలను ప్రశంసించారు. అంతేకాకుండా ప్రతిపక్షాలు కుంభమేళాపై చేస్తున్న ఆరోపణలపై ఘాటుగా సమాధానమిచ్చారు.
“నేడు మహాకుంభ్‌లో పవిత్ర స్నానం చేసే అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇది భగవంతుడి దయ, నా జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం” అని అన్నారు. మహాకుంభ్ 2025 కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు, సేవ, సహకారం, సమర్పణలకు ప్రతీక అని అన్నారు. లక్షలాది మంది భక్తుల మధ్య ఉన్న విశ్వాసం, సేవా భావం భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని చాటుతుందని అన్నారు.
మహాకుంభ్ 2025 పై ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందించారు ఎస్పి సింగ్ బఘేల్. "ప్రతిపక్షాలకు నేను చెప్పదలచుకున్నదేంటంటే వాళ్ళ బిడ్డల పెళ్లిళ్లకు 200-300 మంది వస్తేనే గుండెలు జల్లుమంటాయి. ఇక్కడికి ఇప్పటికే 50 కోట్ల మంది వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఇది ఖచ్చితంగా విజయవంతమైన, చారిత్రాత్మకమైన కార్యక్రమం. ఈ కుంభ్ గతంలో జరిగిన అన్ని కుంభ్‌ల రికార్డులను బద్దలు కొట్టింది" అని అన్నారు.
ఇస్కాన్, అదానీ గ్రూప్ సేవలను ప్రశంసిస్తూ, "అదానీ గ్రూప్ సహకారంతో ఇస్కాన్ ప్రతిరోజూ లక్ష మందికి మహాప్రసాదం అందిస్తోంది. ఈ సేవ కుంభ్ పవిత్రతను మరింత పెంచుతోంది." అని అన్నారు. "దీన్ని మనం మహాప్రసాదం అంటున్నాం ఎందుకంటే, మన దేశంలో 80 కోట్ల మందికి ప్రతి నెలా 5 కిలోల గోధుమలు, బియ్యం ఉచితంగా అందిస్తున్నాం. ఇది భారతదేశ సేవా, సమర్పణ సంప్రదాయానికి నిదర్శనం" అని అన్నారు.