Nitin Gadkari : "రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపిస్తుంది".. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ  సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న 

Published : Jul 25, 2022, 05:39 PM IST
Nitin Gadkari : "రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపిస్తుంది".. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ  సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న 

సారాంశం

Nitin Gadkari On Quitting Politics: కొన్నిసార్లు రాజకీయాలను వదిలి వెళ్లాలని అనిపిస్తుంద‌ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచ‌ల‌న ప్ర‌క‌టన చేశారు. ఈ  ప్రకటనతో రాజ‌కీయంగా కొత్త చర్చ ప్రారంభమైంది. సమాజం కోసం ఇంకా చాలా చేయాల్సి ఉన్నందున రాజకీయాలను వదిలివేయాలని కొన్నిసార్లు అనిపిస్తుందని చెప్పారు.  

Nitin Gadkari On Quitting Politics: కేంద్ర రోడ్డు ర‌వాణా శాఖ‌ మంత్రి నితిన్ గ‌డ్కరీ త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై సంచ‌లన ప్ర‌క‌ట‌న చేశారు. రాజ‌కీయాల క‌న్నా జీవితంలో చూడాల్సింది.. సమాజం కోసం ఇంకా చాలా చేయాల్సి ఇంకా ఎంతో ఉంద‌ని, ఇలాంటి ప‌రిస్థితిల‌లో రాజకీయాలను వదిలివేయాలని కొన్నిసార్లు అనిపిస్తుందని చెప్పారు.

మహారాష్ట్రలోని నాగ‌పూర్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మంత్రి నితిన్ గ‌డ్కరీ మాట్లాడుతూ .. రాజ‌కీయాల‌కు స్వ‌స్తి ప‌ల‌కాల‌ని ఎన్నో సార్లు అనుకున్నాన‌ని, కానీ అలా జ‌ర‌గ‌డం లేద‌న్నారు.సమాజం కోసం చేయాల్సిందని  చాలా ఉంద‌ని,  అప్ప‌డ‌ప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనిపిస్తుందని అన్నారు. 

నేటీ రాజకీయాలు సామాజిక మార్పు, అభివృద్ధికి వాహనంగా కాకుండా అధికారంలో ప‌ర‌మావాధిగా మారిపోయింద‌ని అన్నారు. అస‌లైన‌ రాజకీయాలు అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలని, సమాజం, దేశం సంక్షేమం కోసమా? లేక అధికారంలో ఉండటమా?" అనేది తెలుసుకోవాల‌ని అన్నారు. 

100 శాతం అధికారం సాధించడమే నేటి రాజకీయం: గడ్కరీ

మహాత్మా గాంధీ కాలం నుండి రాజకీయాలు సామాజిక ఉద్యమంలో ఒక భాగమని, అయితే అది దేశం, అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి పెట్టిందని కేంద్ర మంత్రి అన్నారు. నేటీ రాజకీయాలు మాత్రం 100 శాతం అధికారంలోకి రావడమేనని ఆయన అన్నారు. సామాజిక - ఆర్థిక సంస్కరణలకు రాజకీయాలు నిజమైన సాధనమ‌నీ. అందుకే నేటి రాజకీయ నాయకులు సమాజంలో విద్య, కళలు మొదలైన వాటి అభివృద్ధికి కృషి చేయాలని, 
 
గిరీష్‌ భావు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయనను నిరుత్సాహపరిచేవాడిని, ఎందుకంటే నేను కూడా కొన్నిసార్లు రాజకీయాలను విడిచిపెట్టాలని అనుకుంటున్నానని గడ్కరీ అన్నారు. రాజకీయాలకు అతీతంగా జీవితంలో చేయాల్సినవి చాలా ఉన్నాయి.  దివంగత సోషలిస్ట్ రాజకీయ నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్ తన సాధారణ జీవనశైలిని ఆయ‌న‌ కొనియాడారు. 

 రాజకీయ పార్టీలకు మిత్రుడిగా భావించే సామాజిక కార్యకర్త గిరీష్ గాంధీని సన్మానించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ గిరీష్ గాంధీ గతంలో ఎన్సీపీలో ఉన్నారు, కానీ 2014లో ఆ పార్టీని వీడారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu