CBI Busts Racket: రాజ్యసభ సీటు కావాలా..? గవర్నర్ పదవీ కావాలా..? 100 కోట్ల డీల్.. ఘ‌రానా మోసగాళ్ల గుట్టు ర‌ట్టు

Published : Jul 25, 2022, 04:35 PM IST
CBI Busts Racket: రాజ్యసభ సీటు కావాలా..? గవర్నర్ పదవీ కావాలా..? 100 కోట్ల డీల్.. ఘ‌రానా మోసగాళ్ల గుట్టు ర‌ట్టు

సారాంశం

CBI Busts Racket: రాజ్యసభ సీట్లు, గవర్నర్ పదవి ఇప్పిస్తానని నమ్మించి భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు అయింది.  రాజ్యసభ, గవర్నర్ పదవులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పదవులు ఇప్పిస్తామంటూ ప్రజలను మోసం చేసి రూ.100 కోట్ల మేర మోసం చేసిన నలుగురు వ్యక్తులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు అరెస్ట్ చేశారు.  

CBI Busts Racket: రాజ్యసభ సీట్లు ఇప్పిస్తానని, గవర్నర్ పదవి ఇప్పిస్తానని, ప్రభుత్వ సంస్థల్లో లేదా వివిధ మంత్రిత్వ శాఖల్లో చైర్మన్‌లుగా నియమిస్తామ‌ని మాయమాటలతో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులను  మోసం చేసిన ముఠా గుట్టును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రట్టు చేసింది. ఈ ముఠా దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేసిన‌ట్టు సీబీఐ తెలిపింది. ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న నలుగురిని సీబీఐ అరెస్టు చేసింది. ఈ క్ర‌మంలో  పలు చోట్ల సీబీఐ దాడులు కూడా చేసింది.

ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఇటీవల సోదాలు నిర్వహించిందని.. ముఠాలోని నలుగురిని అరెస్టు చేసిందని అధికారులు చెప్పారు. అయితే సోదాలు నిర్వహిస్తున్న సమయంలో నిందితుల్లో ఒకరు దాడి చేసి పారిపోయారని అధికారులు తెలిపారు. సీబీఐ అధికారులపై దాడి చేసినందుకు అతనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వారు వెల్లడించారు. 

ఈ కేసుకు సంబంధించి సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన కమలాకర్ ప్రేమ్‌కుమార్ బండ్‌గార్, కర్ణాటకలోని బెల్గామ్‌కు చెందిన రవీంద్ర విఠల్ నాయక్, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌కు చెందిన మహేంద్ర పాల్ అరోరా, అభిషేక్ బూరా, మహ్మద్ ఐజాజ్ ఖాన్‌లను పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ముఠాలో ప్ర‌ధాన నిందితుడు ప్రేమ్‌కుమార్ బండ్‌గార్ సీనియర్ సీబీఐ అధికారిగా నటిస్తూ ఉన్నత స్థానంలో ఉన్న ప్రభుత్వ అధికారులతో తన సంబంధాలను చాటుకుంటున్నాడని.. భారీగా చెల్లింపుకు బదులుగా తాను పరిష్కరించగల ఏదైనా పనిని తీసుకురావాలని బూరా, అరోరా, ఖాన్ మరియు నాయక్‌లను కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. .
  
సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు  

రాజ్యసభ సభ్యత్వం కోసం సీట్లు ఏర్పాటు చేయడం, వారిని ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా చేయడం, కేంద్ర మంత్రిత్వ శాఖలు, శాఖల పరిధిలోని ఏదైనా ప్రభుత్వ సంస్థకు వారిని అధ్యక్షులను చేయడం వంటివి ఈ రాకెట్ చేసేదని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఇందుకోసం రాకెట్ భారీగా వసూలు చేసిన‌ట్టు తెలిపింది. 

ఈ సమయంలో ఉన్నతాధికారులతో క‌లిసి అక్రమంగా నియామకాలు చేయడంపై బురా బండ్‌గార్‌తో ఎలా చర్చించారనేది కూడా సీబీఐ తన వర్గాల సంభాషణలో తెలిసింది. ఈ రాకెట్‌లోని వ్యక్తులు ప్రజలను మోసం చేసేందుకు బడా బ్యూరోక్రాట్ల పేర్లను దుర్వినియోగం చేసేవారని కూడా సీబీఐకి తెలిసింది.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం