విమానంలో స్మోకింగ్ : ఇలాంటి హానికరమైన ఘటనను ఉపేక్షించేదే లేదు.. మంత్రి జ్యోతిరాదిత్య సింథియా

Published : Aug 12, 2022, 10:08 AM ISTUpdated : Aug 12, 2022, 10:09 AM IST
విమానంలో స్మోకింగ్ : ఇలాంటి హానికరమైన ఘటనను ఉపేక్షించేదే లేదు.. మంత్రి జ్యోతిరాదిత్య  సింథియా

సారాంశం

విమానంలో స్మోకింగ్ చేసిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ వ్యక్తి తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఈ వీడియో మీద నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా దీనిమీద మంత్రి జ్యోతిరాధిత్య సింథియా స్పందించారు. 

న్యూఢిల్లీ :  విమానంలో స్మోకింగ్..  వినడానికే షాకింగ్ గా అనిపిస్తున్ప వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఇన్ స్టాగ్రామ్ లో 6.30 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్న బాబీ కటారియా అనే గుర్గావ్ నివాసి ఈ ఆకతాయి చర్యకు పాల్పడ్డాడు. spicejet విమానంలో వెలుగు చూసిన ఈ ఘటనపై dgca  విస్మయం వ్యక్తం చేసింది. నిందితుడు బాబీ కటారియాపై వెంటనే కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా నిందితుడు విమానంలో సీటుపై దర్జాగా పడుకుని సిగరెట్ కాల్చుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. లైటర్ వెలిగించి సిగరెట్ కాల్చడు. వీడియో కట్ అవడానికి ముందు రెండు సార్లు పొగ ఊదడం కూడా వీడియోలో కనిపించింది.

ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. బాబీ కటారియాకు శిక్ష ఉండదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య  సింధియాకు ట్యాగ్ చేయడంతో ఆయన స్పందించారు. ‘విచారణ జరుగుతోంది. ఇలాంటి హానికరమైన ఘటన విషయంలో ఉపేక్షించేదే లేదు’ అని ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. అయితే ఇది పాత వీడియోగా తమ దృష్టికి వచ్చినట్లు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ వర్గాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ  ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని, తగిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

Indigo: రూ.1616 కే ఇండిగో విమానంలో ప్రయాణం చేసే చాన్స్...ఎలాగో తెలుసుకోండి..

ఈ ఘటనపై  నిందితుడు బాబీ కటారియా తనని తాను సమర్ధించుకున్నాడు. న్యూస్ రిపోర్టర్ల స్క్రీన్ షాట్ లను తన ఇన్ స్టా వాల్ పై పోస్టు చేశాడు. టీఆర్పీ కోసం ప్రయత్నిస్తున్నారంటూ మీడియా పై నిందలు వేసే ప్రయత్నం చేశాడు. విమానాల్లో ధూమపానం ప్యాసింజర్లకు అసౌకర్యంతో పాటు అత్యంత ప్రమాదకరం. భారత్లో విమానాల్లో ధూమపానం నిషేధించబడింది. కాగా గతంలో కూడా నిందితుడు కటారియా నడిరోడ్డుపై కూర్చుని మద్యం సేవించినందుకు అతడిపై ఒక కేసు నమోదయ్యింది. 

 

PREV
click me!

Recommended Stories

చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur
అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families