Anurag Thakur: 'నిజనిర్ధారణ చేసేదెవరో?  శత్రుత్వాన్ని పెంచేదెవరో?' అనురాగ్ ఠాకూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Published : Jul 21, 2022, 08:10 PM IST
Anurag Thakur: 'నిజనిర్ధారణ చేసేదెవరో?  శత్రుత్వాన్ని పెంచేదెవరో?' అనురాగ్ ఠాకూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సారాంశం

Anurag Thakur: స‌మాజంలో అసలు నిజనిర్ధారణ చేసేది ఎవరో ? శత్రుత్వాన్నిపెంచేదెవరో ?  తెలుసుకోవాల‌ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఎవరిపైనైనా ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 

Anurag Thakur: పార్ల‌మెంట్ వ‌ర్ష‌కాల స‌మావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. నేటీ పార్లమెంటు స‌మావేశాల్లో ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్ అరెస్టు వివాదం ప్రతిధ్వనించింది. దీనిపై ఆర్జేడీ ఎంపీ ప్రశ్నలు సంధించగా.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానమిచ్చారు. ఈ విష‌యంపై  కేంద్ర‌ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఫ్యాక్ట్ చెకర్లు, ఫ్యాక్ట్ చెక్ మధ్య తేడాను గుర్తించడం చాలా అవసరమన్నారు. స‌మాజంలో అసలు నిజనిర్ధారణ చేసేది ఎవరో?  శత్రుత్వాన్నిపెంచేదెవరో? అర్థం చేసుకోవాలని అన్నారు. ఎవరిపైనైనా ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 

గత నెలలో ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్ అరెస్టుకు దృష్టిలో పెట్టుకుని ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా.. సమాజంలో శత్రుత్వాన్ని వ్యాప్తి చేసే వారిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని  ప్రశ్నించారు. శత్రుత్వాన్ని పెంచే ప్ర‌క‌ట‌న‌దారుల ప‌ట్ల ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో తెలియ‌జేయాల‌ని ఝా అన్నారు. అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్ర‌శ్నించారు.  

ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా ప్రశ్నకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. ఫిర్యాదు ఆధారంగా వార్తాపత్రికపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసిఐ) స్వయంచాలకంగా సంజ్ఞ తీసుకున్నట్లే, యూనియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫిర్యాదు ఆధారంగా.. ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా ఇది వర్తిస్తుంది. మహ్మద్ జుబేర్ గురించి ప్రస్తావిస్తూ.. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని, అందులో కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రమేయం లేదని అన్నారు.

జుబైర్‌కు బెయిల్: జుబేర్ కు బుధవారం  అన్ని కేసుల్లో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో తీహార్ జైలు నుండి విడుదలయ్యాడు. మహ్మద్ జుబేర్‌పై మతపరమైన మనోభావాలను దెబ్బతీసినట్లు ఆరోపణలు వచ్చాయి.

అలాగే.. ప్రజా ప్రయోజనాలను దెబ్బ‌తీసే.. పలు సోషల్‌మీడియా ఖాతాలు, పలు యూట్యూబ్‌ ఛానల్స్‌ను  తొలగించిన‌ట్టు తెలిపారు. 2021-22 మధ్య కాలంలో 94 యూట్యూబ్‌ ఛానల్స్‌, 19 సోషల్‌ మీడియా ఖాతాలు, 747 వెబ్‌సైట్లపై చర్యలు తీసుకున్నామ‌ని మంత్రి అనురాగ్‌ ఠాకూర్ తెలిపారు. సమాచార సాంకేతిక చట్టం 2000లోని సెక్షన్‌ 69ఎ కింద చర్యలు తీసుకున్న‌ట్టు తెలిపారు. సోష‌ల్ మీడియాలో తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం, ప్రచారం చేయడాన్ని కేంద్రం పూర్తిగా వ్య‌తిరేకిస్తుంద‌నీ, దేశ సార్వభౌమాధికారిన్ని దెబ్బ తీసే ఏజెన్సీలకు ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తుంద‌ని అనురాగ్‌ ఠాకూర్ హెచ్చరించారు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !