నేషనల్ హెరాల్డ్ కేసు: ఈ నెల 25న విచారణకు రావాలని సోనియాకు ఈడీ నోటీసులు

Published : Jul 21, 2022, 06:18 PM ISTUpdated : Jul 21, 2022, 10:41 PM IST
నేషనల్ హెరాల్డ్ కేసు: ఈ నెల 25న విచారణకు రావాలని సోనియాకు ఈడీ నోటీసులు

సారాంశం

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 25న  మరోసారి విచారణకు రావాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ సోనియా గాంధీని ఈడీ అధికారులు విచారించారు. మూడు గంటల పాటు ఆమెను ఈ కేసులో ప్రశ్నించారు. 

న్యూఢిల్లీ: National Herald కేసులో ఈ నెల 25న మరోసారి విచారణకు రావాలని Congress పార్టీ చీఫ్ Sonia Gandhi కి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో Enforcement Directorate  అధికారులు సోనియాగాంధీని ప్రశ్నించారు. ఇవాళ  సుమారు మూడు డంటలపాటు సోనియా గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ విచారణను ముగించాలని సోనియా గాంధీ కోరలేదని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేష్ తేల్చి చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీని ఈడీ అధికారులు విచారించడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణలు ఆందోళనలు నిర్వహించారు. ఢిల్లీలో  ఆందోళనకు దిగిన కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నిరసనకారులపైఢిల్లీలో పోలీసులు వాటర్ క్యాన్లను ప్రయోగించారు. 

ఇవాళ విచారణకు హాజరు కావాలని సోనియా గాంధీకి ఈడీ అధికారులు ఈ నెల 11న నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు అందుకున్న సోనియా గాంధీ విచారణకు హాజరయ్యారు. వాస్తవానికి గతంలోనే ఈడీ విచారణక సోనియా గాంధీ హాజరు కావాలి. కరోనా సోకడం, కరోనా తర్వాత చోటు చేసుకొన్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని సోనియా గాంధీ కోరింది. దీంతో ఈడీ అధికారులు సోనియా గాంధీకి సమయం ఇచ్చారు. ఈ ఏడాది జూన్ మాసంలోనే ఈడీ విచారణను వాయిదా వేయాలని సోనియా గాంధీ కోరారు. ఈ విషయమై ఈడీ అధికారులకరు లిఖిత పూర్వకంగా  కోరింది.

ఈ ఏడాది జూన్ 12న ఆమె ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఈ ఆసుపత్రి నుండి  జూన్ 18న డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే విచారణకు వెళ్లలేదు. ఆరోగ్య కారణాలను చూపుతూ తనకు సమయం కావాలని కోరారుు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా నాలుగు వారాల పాటు సమయం ఇవ్వాలని ఈడీ అధికారులకు లేఖ రాశారు దీంతో ఈడీ అధికారులకు ఆమెకు గడువు ఇచ్చారు. ఈ గడువు పూర్తికావడంతో విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు లేఖ రాశారు.ఈ లేఖ ఆధారంగా ఆమె విచారణకుహాజరయ్యారు.

 నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి  ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  దీంతో ఈ విషయం వెలుగు చూసింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?
Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు