జమ్మూ కాశ్మీర్‌లో వలస కూలీని కాల్చిచంపిన‌ ఉగ్రవాదులు

By Mahesh RajamoniFirst Published Aug 12, 2022, 11:19 AM IST
Highlights

JammuKashmir: జమ్మూ కాశ్మీర్‌లో వలస కూలీని ఉగ్రవాదులు కాల్చిచంపారు. రాజౌరి జిల్లాలోని సైనిక శిబిరంపై దాడిలో నలుగురు సైనికులు మరణించిన ఒక రోజు తర్వాత వలస కార్మికులను ల‌క్ష్యంగా చేసుకుని దాడికి పాల్ప‌డ్డారు.
 

Terrorists attack: జ‌మ్మూకాశ్మీర్ లో స్థానికేత‌రుల‌ను ల‌క్ష్యంగా చేసుకుంటూ ఉగ్ర‌వాదులు మ‌రోసారి రెచ్చిపోయారు. ఒక వ‌ల‌స కూలీపై దాడికి పాల్ప‌డి.. ప్రాణాలు తీశారు. పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. జమ్మూ కాశ్మీర్‌లోని బందిపూర్‌లో బీహార్‌కు చెందిన వలస కూలీని ఉగ్రవాదులు కాల్చిచంపారు. బందిపూర్ జిల్లాలోని అజాస్ ప్రాంతంలో అర్ధరాత్రి ఈ దాడి జరిగింది.  బీహార్‌లోని మాధేపురాకు చెందిన మహ్మద్ అమ్రెజ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపిన తరువాత, అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్ప‌టికే ఆయ‌న చ‌నిపోయాడ‌ని వైద్యులు తెలిపారు. 

"శుక్ర‌వారం మధ్యరాత్రి సమయంలో ఉగ్రవాదులు ఒక వలస కార్మికుడిని కాల్చి చంపారు. టెర్ర‌రిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్య‌క్తి మహ్మద్ అమ్రేజ్, r/o మాధేపురా, బెసర్, బీహార్‌లోని సోద్నారా సుంబల్ కు చెందిన వ్య‌క్తిగా గుర్తించారు. బండిపొరా వద్ద కాల్పులు అత‌న్ని తీవ్రంగా గాయ‌ప‌ర్చారు. అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే, మార్గ‌మ‌ధ్య‌లోనే ప్రాణాలు కోల్పోయాడు" అని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.

During intervening night, fired upon & injured one outside Mohd Amrez S/O Mohd Jalil R/O Madhepura Besarh at Soadnara Sumbal, . He was shifted to hospital for treatment where he succumbed.

— Kashmir Zone Police (@KashmirPolice)

రాజౌరి జిల్లాలో సైనిక శిబిరంపై దాడిలో నలుగురు సైనికులు మరణించి, మరో ఇద్దరు గాయపడిన ఒక రోజు తర్వాత వలస కార్మికుడిని లక్ష్యంగా చేసుకుని ఉగ్ర‌వాదులు ఈ దాడికి పాల్ప‌డ్డారు.  జమ్మూ ప్రాంతంలోని సుంజ్వాన్ శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేసిన ఫిబ్రవరి 2018 తర్వాత జమ్మూ కాశ్మీర్‌లోని ఆర్మీ క్యాంపుపై ఫిదాయీన్ లేదా ఆత్మాహుతి దాడి చోటుచేసుకోవ‌డం ఇదే మొదటిసారి.

“రాజౌరిలో విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన సైనికుల అత్యున్నత త్యాగానికి ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే,  అన్ని శ్రేణులు సెల్యూట్ చేస్తున్నాయ‌నీ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము” అని ఆర్మీ ప్రతినిధి ట్వీట్ చేశారు. గత వారం, పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో బీహార్‌కు చెందిన మహ్మద్ ముంతాజ్ అనే వలస కార్మికుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన కూలీలు మహ్మద్ ఆరిఫ్, మహ్మద్ మక్బూల్ కూడా బీహార్‌కు చెందినవారే.

 


 

click me!