వలస కూలీలకు అద్దెకు గృహ సముదాయాలు: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

By narsimha lodeFirst Published Jul 8, 2020, 6:05 PM IST
Highlights

ప్రధాన్ మంత్రి అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద వలసదారులకు పేదలకు సరసమైన దారులకు అద్దె గృహ సముదాయాలను అభివృద్దికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.

న్యూఢిల్లీ:ప్రధాన్ మంత్రి అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద వలసదారులకు పేదలకు సరసమైన దారులకు అద్దె గృహ సముదాయాలను అభివృద్దికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.

కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగింది.ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేవకర్ మీడియాతో మాట్లాడారు.

ప్రధాన్ మంత్రి అర్బన్ హౌసింగ్ స్కీమ్ కింద వలసదారులకు పేదలకు సరసమైన దారులకు అద్దె గృహ సముదాయాలను అభివృద్దికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు. దీని ద్వారా దేశంలోని 3 లక్షల మందికి ప్రయోజనం కలుగుతోందని ఆయన వివరించారు.

పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను ఈ ఏడాది నవంబర్ వరకు సరఫరా చేయడానికి కేంద్ర కేనెబిట్ ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి  ఐదు కిలోల ఆహారధాన్యాలతో పాటు కేజీ పప్పును అందించనున్నారు. దేశంలోని 81 కోట్ల మందికి దీని వల్ల ప్రయోజనం కలగనుందని మంత్రి వివరించారు.

దేశంలోని 7.4 కోట్ల మంది పేద మహిళలకు సెప్టెంబర్ వరకు మూడు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించనున్నారు. ఇప్పటికే మూడు గ్యాస్ సిలిండర్లను అందించినట్టుగా మంత్రి గర్తు చేశారు.

ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ ను 24 శాతం చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మరో మూడు మాసాల పాటు జూన్ నుండి ఆగష్టు  వరకు ఈ పథకాన్ని పొడిగించింది కేంద్రం. ఈ మేరకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 72 లక్షల ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతోంది. దీని కోసం కేంద్రం రూ. 4860 కోట్లు ఖర్చు చేయనుంది.


 

click me!