ఆకలితో ఓ వలస కార్మికురాలు మృతి చెందింది. ఈ విషయం తెలియని ఆమె కొడుకు తల్లిని లేపేందుకు ప్రయత్నించాడు. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి మొబైల్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
పాట్నా: ఆకలితో ఓ వలస కార్మికురాలు మృతి చెందింది. ఈ విషయం తెలియని ఆమె కొడుకు తల్లిని లేపేందుకు ప్రయత్నించాడు. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి మొబైల్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
లాక్‌డౌన్ వలస కార్మికులకు తీవ్ర కష్టాలను తెచ్చి పెట్టింది. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ను పొడిగించింది.
బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికురాలు గుజరాత్ రాష్ట్రం నుండి శ్రామిక్ రైలులో తన స్వంత గ్రామానికి బయలుదేరింది. ఆ రైలు గమ్యస్థానం చేరుకోవడానికి ముందే ఆమె చనిపోయింది. మృతదేహాన్ని ముజఫర్ నగర్ రైల్వేస్టేషన్ ప్లాట్ ఫారంపై ఉంచారు.
also read:జూన్‌లో కరోనా కేసులు మరింత తీవ్రమయ్యే ఛాన్స్: నిపుణుల వార్నింగ్
శనివారం నాడు రైలులో బాధితురాలు శ్రామిక్ రైలులో బయలుదేరింది. ఆహారం, నీళ్లు లేకపోవడంతో ఆమె అనారోగ్యానికి గురైనట్టుగా చెప్పారు. ముజఫర్ నగర్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగానే ఆమెకు కిందపడిపోయినట్టుగా కుటుంబసభ్యులు చెప్పారు.
దీంతో ఆమెను ఫ్లాట్ ఫారంపై పడుకోబెట్టారు. అక్కడే ఆమె మరణించింది.ఈ విషయం తెలియని ఆమె చిన్న కొడుకు తల్లిని లేపేందుకు ప్రయత్నించాడు. ఈ దృశ్యాన్ని చూసిన వారు కన్నీళ్లు పెట్టుకొన్నారు.