కరోనా ప్రళయం: భారత్ లో లక్షన్నర దాటిన కేసులు!

By Sree s  |  First Published May 27, 2020, 9:53 AM IST

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నేటి ఉదయం 8 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం కరోనా కేసుల సంఖ్యా లక్షా 50 వేలను దాటింది. 1,51,767 కేసులు నమోదైనట్టు నేటి ఉదయం వరకు అందుబాటులో ఉన్న ఆరోగ్య శాఖ డేటా ద్వారా తెలియవస్తుంది. 


భారతదేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నేటి ఉదయం 8 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం కరోనా కేసుల సంఖ్యా లక్షా 50 వేలను దాటింది. 1,51,767 కేసులు నమోదైనట్టు నేటి ఉదయం వరకు అందుబాటులో ఉన్న ఆరోగ్య శాఖ డేటా ద్వారా తెలియవస్తుంది. 

గత 24 గంటల్లో 6,387 కేసులు నమోదయినట్టు తెలియవస్తుంది. ఇప్పటివరకు 64,426 మంది కరోనా వైరస్ బారిన పడి కోలుకోగా 4,337 మంది మరణించారని తెలియవస్తుంది. గడిచిన 24 గంటల్లోనే 170 మంది ఈ కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు. 

Latest Videos

undefined

మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక ఉపశమనం కలిగించే అంశం ఏమిటంటే... రికవరీ రేట్. మార్చ్ లో 7.1 శాతంగా రికవరీ రేట్ ఉండగా అది నేడు 41.6 శాతానికి పెరిగిందని లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా వైరస్ మరణాల్లో కూడా గతంలో 3.3 శాతంగా ఉండగా అది నేడు 2.87 గా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

కరోనా వైరస్ పట్ల సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండండని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.... కొందరి నిర్వాకం వల్ల మాత్రం ఈ వైరస్ వ్యాపిస్తునే ఉంది. వారి వల్ల కోవిడ్ -19 కట్టడి కాకపోగా, విస్తరిస్తూ ఉంది. అటువంటి సంఘటనే హైదరాబాదులో జరిగింది. 

హైదరాబాదు శివారులోని పహాడీషరీఫ్ లో జరిగిన ఓ ఫంక్షన్ లో పాల్గొన్న 22 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. వారిలో 13 మంది ఒకే కుటుంబానికి చెందినవారు. పహాడీషరీఫ్ లోని మటన్ వ్యాపారి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రతి యేటా వేసవిలో ఒక చోటు సరదాగా గడపడం ఆనవాయితీగా వస్తోంది. 

ఎప్పటిలాగే ఈసారి కూడా పది రోజుల క్రితం నాలుగు కుటుంబాలకు చెందిన 28 మంది వేడుక చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ వేడుకకు జియాగుడా, గౌలిపురా, బోరబండ ప్రాంతాల నుంచి ముగ్గురు చొప్పున సంతోష్ నగర్ నుంచి ఐదుగురు హాజరయ్యారు. వారితో పాటు మటన్ వ్యాపారి బంధువులు పాల్గొన్నారు.

మొత్తం 42 మంది ఒక చోట చేరి సరదాగా గడిపారు. రెండు రోజుల పాటు వేడుక చేసుకున్నారు. ఆ తర్వాత వారిలో 18 మంది మహేశ్వరం మండలం హర్షగుడాలో కిరాణా షాపు నడిపించే బంధువు ఇంటికి వచ్చారు. ఆయన నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి వేడుక చేసుకున్నారు. 

బోరబండ నుంచి వేడుకకు హాజరైన ముగ్గురికి, సంతోష్ నగర్ నుంచి వచ్చినవారిలో ఇద్దరికి నాలుగు రోజుల కిందట కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. పహడీషరీఫ్ లో జరిగిన విందు విషయం తెలిసి వైద్య సిబ్బంది, అందులో పాల్గొన్న 28 మందిని ఈ నెల 23వ తేదీన హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. 

సోమవారం వారి శాంపిల్స్ పరీక్షించగా 13 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కిరాణా కొట్టు వ్యాపారి కుటుంబానికి నలుగురికి పాజిటివ్ వచ్చింది. దాంతో వేడుకలో పాల్గొన్న మొత్తం 22 మంది కరోనా వైరస్ సోకింది. 

పహడీషరీఫ్ లో కరోనా వ్యాధి సోకిన వ్యక్తి మటన్ వ్యాపారి కావడంతో ఆ ప్రాంతంలో ఆరోగ్య సిబ్బంది సర్వే చేశారు. అతని వద్ద మటన్ కొన్నారని భావించిన వారిని పరిశీలించారు. ప్రాథమిక కాంటాక్ట్ కింద 21 మందిని, సెకండరీ కాంటాక్ట్ కింద 47 మందిని గుర్తించి రావిర్యాల క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. 

కిరాణాకొట్టు వ్యాపారి నుంచి ఎంత మంది సరుకులు కొనుగోలు చేశారనే విషయంపై కూడా అధికారులు ఆరా తీశారు. ఆ బస్తీలో ఉండే 125 ఇళ్లను గుర్తించి కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. 

click me!