
ఢిల్లీ : ఒక కేసులో Uttarakhand హైకోర్టు పై Baseless allegations చేసిన వ్యక్తి కోర్టు ఖర్చుల కింది రూ. 25 లక్షలు చెల్లించాలని జనవరి 4న తామిచ్చిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు సమర్థించుకుంది. ‘ఇలాంటి పోకడలకు అడ్డుకట్ట పడాలి. ఈ సందేశం అత్యంత బలంగా.. స్పష్టంగా వెళ్లాలి. అందుకే ఈ అదేశాల విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వడం లేదు’ అని జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ సి.టి. రవికుమార్ ల ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. వ్యాఖ్యలు చేసిన వ్యక్తి తన పొరపాటు తెలుసుకున్నారని, భవిష్యత్తులో అత్యంత జాగ్రత్తగా ఉంటారని, Court costs మొత్త మీద ఔదార్యం చూపించాలని ఆయన తరఫు న్యాయవాది అభ్యర్థించారు.
తానొక పింఛన్ దారుడినని, ఒక నెల పింఛన్ కోర్టులో జమ చేస్తానని, రూ. 25 లక్షలు కట్టడం తనవల్ల కాదని న్యాయవాది ద్వారా పిటిషన్ దారుడు తెలిపారు. దీని మీద ధర్మాసనం స్పందిస్తూ.. నిజానికి తాము కోర్టు ధిక్కారణ చర్యల్ని ఆయన మీద ఇప్పటికే మొదలు పెట్టి ఉండాలని, అలా చేయలేదని తెలిపింది. ఇదివరకు ఇచ్చిన ఆదేశాలను వారం రోజుల్లో అమలు చేయాలని స్పష్టం చేసింది.
మైనారిటి విద్యాసంస్థల చట్టం మీద అఫిడవిట్ ఆలస్యం మీద అసంతృప్తి..
‘మైనారిటీ విద్యాసంస్థల చట్టం- 2004’లో సెక్షన్ 2 (ఎఫ్) చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మీద కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడం మీద సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఖర్చుల రూపేణా రూ. 7,500 చెల్లించి దీనికి దాఖలు చేయడానికి ప్రభుత్వానికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ల ధర్మాసనం సోమవారం తెలిపింది. ఇది రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారని, వారు ఆ మేరకు ప్రయోజనాలు పొందలేకపోతున్నారని పిటిషన్ దారుడు తెలిపారు.2020 ఆగస్ట్ 28న నోటీసు ఇచ్చినా ఇంతవరకు కౌంటర్ అఫిడవిట్ సమర్పించకపోవడం సముచితం కాదని ధర్మాసన వ్యాఖ్యానించింది.
ఇదిలా ఉండగా, సోమవారం దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఏర్పాటైన Justice Sirpurkar Commission విచారణను పూర్తి చేసింది. విచారణకు సంబంధించిన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. సిర్పూర్కర్ కమిషన్ ఈ నెల 28న సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. 2019 నవంబర్‌లో షాద్‌నగర్ శివారు జరిగిన దిశ అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిని డిసెంబర్ 6 తెల్లవారు జామున సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం పోలీసులు చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నింది మరణించారు.
దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ త్రిసభ్య కమిషన్‌ని వేసిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ చైర్మెన్ గా సుప్రీంకోర్టు రిటైర్ట్ జడ్డి జస్టిస్ సిర్పూర్కర్ ను నియమించింది.ఈ కమిషన్ 47 రోజుల పాటు ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగింది. ఫోరెన్సిక్ నివేదికలు, డాక్యుమెంట్ రికార్డ్స్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, పోస్ట్ మార్టం రిపోర్ట్స్, సీన్ ఆఫ్ అఫెన్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కమిషన్ సభ్యులు సేకరించారు. అడ్వకేట్స్, ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు, మాజీ సైబరాబాద్ సీపీ సజ్జనార్, దిశ కుటుంబ సభ్యులు, ఎన్ కౌంటర్ లో చనిపోయిన కుటుంబ సభ్యులను కమిషన్ కలిసి విచారణ చేపట్టింది. తాజాగా విచారణ పూర్తి చేసి సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించింది.