మానసిక వైకల్యంతో తండ్రిని చంపిన కూతురు.. రంగంలోకి పోలీసులు

Published : Apr 18, 2022, 03:42 PM ISTUpdated : Apr 18, 2022, 04:06 PM IST
మానసిక వైకల్యంతో తండ్రిని చంపిన కూతురు.. రంగంలోకి పోలీసులు

సారాంశం

గోవాలో దారుణం జరిగింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఓ మహిళ ఇంటిలో నిద్రిస్తున్న తన తండ్రిపై బలమైన కర్రతో దాడి చేసి చంపేసింది. ఈ హత్యకు గల తక్షణ కారణం తెలియరాలేదు. పోలీసులు మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పనాజీ: మానసిక వైకల్యం ఒక మనిషిని దారుణంగా పీడిస్తుంది. వారి జీవితాన్ని స్వయంగా అనుభవించలేకపోతారు. ఆ సమస్య వారికే కాదు.. ఆమె చుట్టుపక్కల వారిపైనా దాని ప్రభావం పడుతుంది. ఒక్కోసారి ఆ మానసిక వైకల్యం సదరు వ్యక్తి ప్రాణాలు పోయేలా చేయవచ్చు. అంతేకాదు, మరొకరినీ హతమార్చేలా పురికొల్ప వచ్చు. ఏదీ అదుపులో ఉండని కారణంగా మానసిక వైకల్యం సమస్యను తీవ్రంగా పరిగణించాలి. కానీ, దానిపై పెద్దగా అవగాహన లేకపోవడం సమస్యను మరింత జఠిలం చేస్తుంటాయి. తాజాగా, గోవాలో మానిసక దౌర్భల్యం ఉన్న ఓ మహిళ ఏకంగా తన తండ్రినే బలమైన ఓ దుంగతో కొట్టి చంపింది.

50 ఏళ్ల మేరియాన్ కార్డోసో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు పెళ్లి అయినప్పటికీ ఈ సమస్య కారణంగానే 2000 విడాకులు అయ్యాయి. అప్పటి నుంచి ఆమె తన తల్లితండ్రులతోనే గోవాలో కలిసి ఉంటున్నారు. దక్షిణ గోవాలోని అంబాలిమ్ గ్రామంలో వారు నివాసం ఉంటున్నారు. ఈస్టర్ ప్రేయర్స్ కోసం కార్డోసో సమీపంలోని ఓ చర్చికి వెళ్లారు. ప్రేయర్స్ ముగిశాక ఆమె తిరిగిన ఇంటికి చేరుకున్నారు. శనివారం, ఆదివారం మధ్య రాత్రి ఆమె ఇంటి వద్ద తన తండ్రితో ఉన్నారు. 76 ఏళ్ల తండ్రి ఫెడిలిస్ మెరియానో పెద్దా పడుకుని ఉన్నారు. తల్లి తన సోదరి ఇంటికి వెళ్లింది.

ఆ రోజు రాత్రి నిద్రిస్తున్న తన తండ్రి ఫెడిలిస్ మెరియానో పెద్దాపై ఓ బలమైన కర్రతో దాడి చేసింది. ఈ దాడిలో తండ్రి మరణించాడు. 

ఈ విషయం పోలీసులకు తెలిసింది. వారు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఇప్పటికే మెంటల్ సిచువేషన్ కోసం చికిత్స తీసుకుంటున్నారు. పోలీసులు కూడా ఆమెను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రి, హ్యూమన బిహేవియర్‌కు చేర్చినట్టు అధికారులు తెలిపారు. 

ఈ ఘటనకు తక్షణ కారణం ఏమై ఉంటుందా? అనే విషయంపై స్పష్టత లేదు. అయితే, పోలీసులు మాత్రం మర్డర్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.

jangaon district కేంద్రంలో దారుణం వెలుగు చూసింది. ఓ భార్య తల్లిదండ్రులతో కలిసి భర్త కళ్లలో కారం కొట్టి దారుణంగా murder చేసింది. భర్త తీరుతో విసుగు చెందిన భార్య తల్లిదండ్రులతో కలిసి.. కట్టుకున్న భర్తనే కడతేర్చింది. బుధవారం తెల్లవారుజామున పట్టణంలోని అంబేద్కర్ నగర్‌లో ఓ మహిళ తల్లిదండ్రుల సహకారంతో భర్తను హత్య చేసింది. జనగాం ఇన్‌స్పెక్టర్‌ ఇ శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు అనుమండల వినోద్‌ (34)గా గుర్తించారు. 

వినోద్‌ చాలాకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఇతనికి మంజుల అనే అమ్మాయితో వివాహం అయ్యింది. అయినా తాగుడు మానలేదు. పెళ్లైన తరువాతినుంచి తాగొచ్చి భార్య మంజులతో తరచూ గొడవపడేవాడు. తాగుడు మానమని ఎన్నిసార్లు మంజుల కోరినా వినోద్ వినలేదు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ బాగా గొడవలు జరుగుతుండేవి. ఇది తట్టుకోలేక విసిగిపోయిన మంజుల 2019లో  అతడిని విడిచిపెట్టింది. ఆ తరువాత తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది. 

అక్కడే వారితో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో గత మంగళవారం రాత్రి వినోద్ తాగి.. ఇంటికి వచ్చి భార్య, అత్తమామలతో గొడవ పడ్డాడు. దీంతో విసిగిపోయిన భార్య, అత్తామామలు వినోద్ కళ్లలో కారం పోసి కత్తితో పొడిచారు. దీంతో వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు.

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు