కరోనా పాజిటివ్ నిర్థారణ అయిన మూడు రోజుల్లోనే.. ఎమ్మెల్యే కన్నుమూత.. !

Published : Sep 11, 2021, 10:52 AM IST
కరోనా పాజిటివ్ నిర్థారణ అయిన మూడు రోజుల్లోనే.. ఎమ్మెల్యే కన్నుమూత.. !

సారాంశం

కరోనా చికిత్స పొందుతూ మావంగాప్‌ లోని స్వగృహంలో సున్ కన్నుమూశారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఎమ్మెల్యే సింటార్ క్లాస్ సున్ కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసు టీకా కూడా తీసుకోలేదు. 

షిల్లాంగ్ : మేఘాలయ స్వతంత్ర ఎమ్మెల్యే సింటార్ క్లాస్ సున్ శుక్రవారం కరోనాతో కన్నుమూశారు. అంతక్రితం మంగళవారమే ఆయనకు  కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.  ఈ నేపథ్యంలోనే  సింటార్ క్లాస్ సున్ ఆరోగ్యం క్షీణించింది.

కరోనా చికిత్స పొందుతూ మావంగాప్‌ లోని స్వగృహంలో సున్ కన్నుమూశారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఎమ్మెల్యే సింటార్ క్లాస్ సున్ కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసు టీకా కూడా తీసుకోలేదు.  ఇతని మాదిరిగానే మరో ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక్క డోసు టీకా కూడా తీసుకోలేదు.  

2016లో రాజకీయాల్లో కాలుమోపిన ఆయన 2018లో మావంగాప్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎమ్మెల్యే అయ్యారు.  ఎమ్మెల్యే సింటార్ క్లాస్ సున్  మృతికి మేఘాలయ ముఖ్యమంత్రి కొనరాడ్ సంగ్మా సంతాపం వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word