September 9/11 : అమెరికా తరహాలో.. ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేస్తాం.. బెదిరింపు కాల్, హైఅలర్ట్..

Published : Sep 11, 2021, 10:30 AM IST
September 9/11 : అమెరికా తరహాలో.. ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేస్తాం.. బెదిరింపు కాల్, హైఅలర్ట్..

సారాంశం

లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చివేస్తామని బెదిరింపు కాల్ రావడంతో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో భద్రతా అధికారులు శుక్రవారం అర్ధరాత్రి అప్రమత్తమయ్యారు. 

న్యూ ఢిల్లీ : అమెరికాలోని 9/11 దాడి తరహాలో లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని  పేల్చివేస్తామని బెదిరింపు కాల్ రావడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యింది. 

ఢిల్లీ విమానాశ్రయాన్ని తాము స్వాధీనం చేసుకుంటామని గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీ పోలీసులకు బెదిరింపు కాల్ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు. లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చివేస్తామని బెదిరింపు కాల్ రావడంతో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో భద్రతా అధికారులు శుక్రవారం అర్ధరాత్రి అప్రమత్తమయ్యారు. 

బాంబు బెదిరింపు కాల్ రాత్రి ఢిల్లీలోని రహోలా పోలీస్ స్టేషన్కు వచ్చింది.  విమానాశ్రయానికి వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నామని ఢిల్లీ డిసిపి ప్రతాప్ సింగ్ ట్వీట్ చేశారు. విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కాల్సిన వారు ఆలస్యం చేయకుండా ముందుగా రావాలని  డిసిపి ప్రయాణీకులకు సూచించారు.  బెదిరింపు నేపథ్యంలో విమానాశ్రయంలో అన్ని ప్రాంతాలను భద్రతా అధికారులు తనిఖీ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

బీహార్ రాజకీయాల్లో 30ఏళ్ల BJP కోట బద్దలు ప్రశాంత్ కిషోర్ చారిత్రక విజయం| Prashant Kishor victory
త్వరలో ప్లాస్టిక్ నోట్లు...ఇక పాత నోట్లు బ్యాన్ చేస్తారా? | Plastic Currency in India