దేశంలో కరోనా విలయతాండవం: టెస్టులు చేయించుకున్న ఇద్దరు సీఎంలు.. రిపోర్ట్‌లో

By Siva KodatiFirst Published Jun 29, 2020, 7:46 PM IST
Highlights

భారతదేశంలో కరోనా వైరస్ కేసుల ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు బాధితులు, మరణాలు పెరిగిపోతున్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా కోవిడ్ 19 బారినపడటం ఆందోళన కలిగిస్తోంది

భారతదేశంలో కరోనా వైరస్ కేసుల ఉద్ధృతి ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు బాధితులు, మరణాలు పెరిగిపోతున్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా కోవిడ్ 19 బారినపడటం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికే మంత్రులు, రాజకీయ నాయకులు ఈ లిస్ట్‌లోకి వెళ్లిపోయారు. తాజాగా పుదుచ్చేరి, మేఘాలయ ముఖ్యమంత్రులు ముందు జాగ్రత్త చర్యగా కరోనా టెస్టులు చేయించుకున్నారు.

అయితే ఈ పరీక్షల్లో ఇద్దరికీ నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మేఘాలయ సీఎం కే సంగ్మాకు రెండోసారి కూడా నెగిటివ్ వచ్చినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

సంగ్మా రక్తనమూనాలను జూన్ 22న సేకరించి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎందుకైనా మంచిదని ఆదివారం కూడా మరో దఫా కోవిడ్ పరీక్షలు చేయగా మళ్లీ నెగిటివ్ వచ్చింది.

ముఖ్యమంత్రికి నెగిటివ్ రావ‌డంతో అధికారులు, అభిమానులు ఉపిరిపీల్చుకున్నారు. ఇక ఇప్పటి వరకు మేఘాల‌య‌లో 50 మంది కరోనా బారినపడ్డాయి. అయితే, ఒకరు మాత్రమే కరోనాతో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

ఇకపోతే.. పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి కూడా ఇప్పటికే కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆయనతో పాటు సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టులలో సీఎంతో పాటు సిబ్బందికి కూడా నెగిటివ్ వచ్చింది.

అయితే సీఎం కార్యాలయం వద్ద వుండే ఓ గన్‌మెన్‌ తండ్రికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో 32 మంది భద్రతా సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరికి సంబంధించిన నివేదిక రావాల్సి వుంది. 
 

click me!