
Medha Patkar News: నర్మదా బచావో అభియాన్ నాయకురాలు మేధా పాట్కర్ పై కేసు నమోదైంది. ఆమెతో సహా 12 మందిపై బర్వానీ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. మేధా పాట్కర్ నిర్వహిస్తున్న నర్మదా నవనిర్మాణ అభియాన్ అనే స్వచ్ఛంద సంస్థలో కోట్లాది రూపాయల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
గిరిజనుల పిల్లల చదువుల పేరుతో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ప్రచారం జరుగుతుంది. జిల్లాలోని రాజ్‌పూర్ బ్లాక్ టెమ్లా గ్రామానికి చెందిన ప్రీతమ్‌రాజ్ బడోలె ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ విషయంలో పోలీసులు పూర్తి మౌనం దాల్చారు. మేధా పాట్కర్ నిరాధారమైన ఆరోపణలను ఆడిట్ చేయాలని అన్నారు.
ప్రీతమ్‌రాజ్ బడోలే ఫిర్యాదు మేరకు మేధా పాట్కర్‌తో పాటు పర్వీన్ రూమీ జహంగీర్, విజయ చౌహాన్, కైలాష్ అవస్య, మోహన్ పటీదార్, ఆశిష్ మాండ్లోయ్, కేవల్ సింగ్ బసవే, సంజయ్ జోషి, శ్యామ్ పాటిల్, సునీతి ఎస్‌ఆర్, నూర్జీ పద్వీలపై మోసం కేసు నమోదైంది. కేశవ్ వాస్వే. పాట్కర్ నిర్వహిస్తున్న ఎన్జీవోలో 14 ఏళ్లలో రూ.13.50 కోట్లు పోగుపడ్డాయని ప్రీతమ్‌రాజ్ చెబుతున్నారు.
విరాళాలకు దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం...
గిరిజనుల పిల్లల చదువుల పేరుతో విరాళాలను సేకరించి.. ఆ మొత్తాన్ని దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించారని ప్రీతమ్‌రాజ్ ఆరోపించారు. ఆయన ఎంత ఖర్చు చేశారన్నది స్పష్టంగా వెల్లడించలేదని తెలిపారు.ఇటీవల బ్యాంకు నుంచి 1.5 కోట్లకు పైగా నగదు ఉపసంహరణ జరిగిందనీ, అయితే.. ఆ ఉపసంహరణలకు సంబంధించిన ఆడిట్, ఇతర ఖాతా వివరాలు కూడా అస్పష్టంగా ఉన్నాయని, ట్రస్ట్ యొక్క 10 ఖాతాలలో.. 4 కోట్లకు పైగా విత్‌డ్రా చేయబడ్డాయి. ట్రస్ట్ ద్వారా సేకరించిన డబ్బు అభివృద్ధి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరసనల నిర్వహణ కోసం మళ్లించబడుతోందని ఆరోపించారు.
పాట్కర్ ఖాతాలో 19 లక్షల రూపాయలు
మేధా పాట్కర్ సేవింగ్స్ ఖాతాలో 19 లక్షలకు పైగా డబ్బు పంపబడిందని ప్రీతమ్‌రాజ్ ఆరోపించారు. మేధా కోర్టులో ఆదాయాన్ని క్లెయిమ్ చేస్తూ.. ఏడాదికి రూ.6000 చూపారు. ఎంపి, మహారాష్ట్రలోని గిరిజనులకు ప్రాథమిక విద్య అందించాలనే పేరుతో ఎన్జీవో విరాళాలు సేకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో సమాచారం ఇవ్వకుండా పోలీసులు తప్పించుకుంటున్నారు. ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ దీపక్ కుమార్ శుక్లా తెలిపారు. దాని ఆధారంగా దర్యాప్తు చేస్తామన్నారు.
మా వద్ద ఖాతా సమాచారం ఉంది, కోర్టులో సాక్ష్యాలను అందజేస్తాము
నేను ఫిర్యాదు చేసిన తర్వాత.. మేధా పాట్కర్‌తో సహా 12 మందిపై చీటింగ్ కేసు నమోదు చేయబడింది. ఆమె ఖాతా నుండి ఎంత మొత్తం నగదు విత్‌డ్రా చేయబడిందో? అందుకు తగ్గ పూర్తి సమాచారం అందింది. కోర్టులో ఆధారాలు అందజేస్తాం.
-ప్రీత్రంరాజ్ బడోలె, ఫిర్యాదుదారు
మేము ఖాతాలను ఆడిట్ చేసాము, నోటీసు రాలేదు
ఫిర్యాదుదారు మాపై తప్పుడు ఆరోపణలు చేశారు. అన్ని ఖాతాలు ఆడిట్ చేయబడ్డాయి. పోలీసుల నుంచి మాకు ఎలాంటి నోటీసులు అందలేదు. దీనికి ఇంతకు ముందు చాలాసార్లు సమాధానం చెప్పాం. ఫిర్యాదుదారుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. పాఠశాల లేదని, మాతో వస్తే ఎన్ని పాఠశాలలు ఉన్నాయో ..చెబుతాం.. వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం - మేధా పాట్కర్, నేత్రి, నర్మదా బచావో ఆందోళన్.
ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్
ట్రస్ట్‌లో ఆర్థిక అవకతవకలపై ఫిర్యాదు అందింది, దాని ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ఫిర్యాదులో ఇచ్చిన సమాచారం ఆధారంగా పత్రాలను పరిశీలిస్తారు. - దీపక్ కుమార్ శుక్లా, ఎస్పీ.