షాకింగ్ : మాస్క్ జారిందని.. కుక్కను కొట్టినట్టు కొట్టారు.. పోలీసుల ఘాతుకం..

By AN TeluguFirst Published Apr 7, 2021, 10:40 AM IST
Highlights

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మాస్క్ జారిందని ఇండోర్‌లో ఓ వ్యక్తిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మాస్క్ జారిందని ఇండోర్‌లో ఓ వ్యక్తిని పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అనారోగ్యంతో ఉన్న తండ్రిని ఆసుపత్రిలో చూడడానికి వెడుతున్న కృష్ణ కేయర్ అనే 35 ఏళ్ల ఆటో రిక్షా డ్రైవర్ మాస్క్ మూతినుంచి కిందకు జారిపోయింది. ఇది గమనించిన ఇద్దరు పోలీసులు అతన్ని రోడ్డుపై పట్టుకుని పోలీస్ స్టేషన్ కు పద అంటూ డిమాండ్ చేశారు. దీనికి అతను నిరాకరించడంతో, వారు అతనిని కొట్టడం ప్రారంభించారు.

జరుగుతున్న ఘటనను చోద్యం చూస్తున్న ఓ వ్యక్తి తన సెల్‌ఫోన్ లో చిత్రీకరించాడు. దీంతో ఈ విషయం వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఓ వ్యక్తిని ఇద్దరు పోలీసులు రోడ్డు మీద పడేసి కొడుతున్నారు. అతను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ అరుస్తున్నాడు. అతనితోపాటు వచ్చిన అతని కొడుకు సహాయం కోసు అరుస్తున్నాడు. 

పట్టపగలు, నడిరోడ్డులో ఈ ఘోరం జరుగుతుంటే అందరూ నిలుచుని చూస్తున్నారు కానీ ఒక్కరూ ఆపడానికి ముందుకు రాలేదు. విషయం ఏంటంటే.. చుట్టూ ఉన్నవాళ్లలో చాలామందికి కూడా అసలు మాస్కులే లేకపోవడం. 

ఈ ఇద్దరు పోలీసులను కమల్ ప్రజాపత్, ధర్మేంద్ర జాట్ లుగా గుర్తించారు. అయితే వీరిమీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీడియో వైరల్ అయిన తరువాత వారిద్దరినీ సస్పెండ్ చేసి పోలీస్ లైన్స్‌కు పంపారు.

గత కొద్ది వారాలుగా దేశవ్యాప్తంగా మాస్క్ లేదని ప్రజలమీద పోలీసుల దాడులు చేస్తున్నట్టు రిపోర్ట్ వస్తున్నాయి. రోడ్డు మీద ఆగి తినడానికో, తాగడానికో మాస్క్ తీస్తే కూడా పోలీసులు జరిమానా విధిస్తున్నట్లు అనేక వాట్సప్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

మార్చి 30 న, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్ నిబంధనలను సరిగా అమలు చేయమని రాష్ట్రాలకు తెలిపింది. నియమాలు ఉల్లఘించకుండా చట్టాన్ని చేయండి, జరిమానాలు విధించండి. అని తెలిపింది. అంతేకాదు తప్పనిసరిగా ప్రజలు మాస్క్ ధరించాలని వాక్సిన్ అడ్మినిష్ట్రేషన్ జాతీయ నిపుణుల కమిటీ చైర్మన్ వి.కె పాల్ అన్నారు.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తుండడంతో కేంద్రం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 10 రాష్ట్రాల్లో 90 శాతం కేసుల పెరుగుదల నమోదవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధికారులతో సోమవారం సమావేశం అనంతరం కేసుల సంఖ్య విపరీతంగా పెరగడానికి ప్రజలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం, నిర్లక్ష్యం కారణంగా తేలింది.  మాస్కులు వాడకపోవడం, సామాజిక దూరం పాటించకపోవడం ముఖ్యమైన కారణాలు. 

కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. గత 24 గంటల్లో 3,722 తాజా కేసులు, 18 మరణాలు సంభవించాయి. మార్చి నుండి, మాస్కులు ధరించనందుకు 1,61,000 మందికి జరిమానా విధించారు. ఇలా వసూలు చేసిన మొత్తం 1.85 కోట్లు.

click me!