మామతో అక్రమ సంబంధం: ప్రియుడితో కలిసి భర్తను చంపేసి...

Published : Apr 07, 2021, 09:04 AM IST
మామతో అక్రమ సంబంధం: ప్రియుడితో కలిసి భర్తను చంపేసి...

సారాంశం

ఓ మహిళ వరుసకు మామ అయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన సంబంధానికి అడ్డు ఉన్నాడని భర్తను హత్య చేయించింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

బెంగళూరు: కర్ణాటకలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వరుసకు మామ అయిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ తన భర్తను చంపించింది. కర్ణాటకలోని టీబీ డ్యామ్ పీఎల్సీ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద హత్య జరిగింది. ఈ హత్య కేసులో మృతుడి భార్యను పోలీసులు అరెస్టు చేశారు. 

గత నెల 20వ తేదీ రాత్రి టీబీ డ్యామ్ పిఎల్సీ కాలనీ నివాసి, కేబుల్ ఆపరేటర్ మైకేల్ జాన్ (40) అనే వ్యక్తి దారుణమైన హత్యకు గురయ్యాడు. రైల్వే ట్రాక్ వద్ద మద్యం మత్తులో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాయి వేశారు. దాంతో అతను మరణించాడు.

ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా మైకేల్ జాన్ భార్య సుర్గుణంను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మైకేల్ జాన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు భార్య సద్దుణం అనే విషయం తేలింది. 

ఆమెకు వరుసకు మామ అయ్యే వినోద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉండేది. వినోద్ వివాహం చేసుకోవాలని ఆమె భావించింది. అందుకు భర్తను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. మద్యానికి బానిసైన మైకేల్ జాన్ తరుచుగా తనను, పిల్లలను మానసికంగా, శారీరకంగా హింసిస్తూ వస్తున్నాడు. దాంతో ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు పథక రచన చేసింది. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు వినోద్, అశోక్ పరారీలో ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word