బ్రిజ్ భూషణ్‭పై లైంగిక ఆరోపణల కలకలం.. ఏడుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసిన భారత రెజ్లింగ్ సంఘం

By Rajesh KarampooriFirst Published Jan 21, 2023, 12:59 AM IST
Highlights

 బీజేపీ నేత, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపడానికి భారత రెజ్లింగ్ సంఘం  ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.  

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఆరోపణలపై విచారణ జరపడానికి తాజాగా  ఇందుకోసం ఏడుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. భారత ఒలింపిక్ సంఘం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో మేరీకోమ్, యోగేశ్వర్ దత్, డోలా బెనర్జీ, అలకనంద అశోక్, సహదేవ్ యాదవ్,  ఇద్దరు న్యాయవాదులు సభ్యులుగా ఉన్నారు.

అంతకుముందు.. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌ను ఆశ్రయించారు. బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, రవి దహియా, దీపక్ పునియా ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు లైంగిక వేధింపులు,ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో పాటు డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిని బర్తరఫ్ చేయాలని, లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు కమిటీని వేయాలని డిమాండ్‌ చేశారు.

లేఖలో రెజ్లర్లు ఏం రాశారు?

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆటగాళ్లను మానసికంగా హింసించాడని ఆటగాళ్లు తమ ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. రెజ్లర్లకు స్పాన్సర్‌షిప్ డబ్బు కూడా ఇవ్వరనీ, కోచ్‌లు మెరిట్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయడం లేదనీ, బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ రాజీనామాపై విచారణ జరిపేందుకు వీలైనంత త్వరగా కమిటీని ఏర్పాటు చేయాలని పిటి ఉషను రెజ్లర్లు డిమాండ్ చేశారు.

రాజీనామాకు నిరాకరించిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ 

అదే సమయంలో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రాజీనామా చేసేందుకు నిరాకరించారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని కూడా చెప్పారు. తాను ఇలాంటి బెదిరింపులకు భయపడనని, తాను ఎన్నుకోబడిన వ్యక్తిని, ఎవరి దయతో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవిని చేపట్టలేదని శరణ్ సింగ్ స్పష్టం చేశారు. అదే సమయంలో తాను దేశం విడిచిపోవచ్చని వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారా అని మీడియా ప్రశ్నించగా.. కేంద్ర హోమంత్రి అమిత్ షా, క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ లో ఎవరిని తాను కలవలేదని, తాము ఎవరితోనూ మాట్లాడలేదని అన్నారు. హర్యానాకు చెందిన 300 మంది అథ్లెట్లు తమ వద్ద ఉన్నారని బ్రిజ్ తెలిపారు. అయితే, సాయంత్రం 4 లేదా 5గంటల సమయంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటుచేసి అన్ని విషయాలను వెల్లడిస్తానని అన్నారు. కానీ.. ఆయన ఈ మీడియా సమావేశం నిర్వహించలేదు.

click me!