ఈ క్షణం బతికున్నాం.. ఎప్పుడు పోతామో తెలియదు.. వీరజవాన్ చివరి మాటలు వైరల్..

By AN TeluguFirst Published Nov 28, 2020, 1:58 PM IST
Highlights

జవానుగా ఉద్యోగం అంటేనే ప్రాణాల మీద ఆశ వదులుకోవాలి. చలి, మంచు, ఎండా, వాన లెక్క చేయక దేశానికి కాపలా కాయాలి. నెలల తరబడి కుటుంబానికి, అనురాగానికి దూరంగా ఉండాలి. ఏ క్షణాన శత్రువులు విరుచుకుపడతారో తెలియదు. గడిచిన క్షణాలే బతికిన క్షణాలు. మరునిముషంలో ప్రాణం ఉంటుందో, పోతుందో గ్యారంటీ ఉండదు. ఆ విషయం తెలిసినా దేశరక్షణకే నడుం బిగిస్తాడు జవాన్. 

ఇటీవల వీర మరణం పొందిన ఓ జవాన్ ముందు రోజు తన స్నేహితుడితో చెప్పిన చివరి మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏదో ఒక రోజు మాకు మరణం తప్పదు కదా అంటూ ఓ వీర జవాన్ అన్న మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. 

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా చాలిగావ్‌ తాలూకాకు చెందిన యశ్‌ దేశ్‌ముఖ్(21) 2019లో ఆర్మీకి ఎంపికయ్యారు. ఆ తరువాత జమ్ముకశ్మీర్‌లోని 10 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో గత గురువారం శ్రీనగర్‌లోని పారింపొరాలో జరిగిన దాడిలో యశ్‌ ప్రాణాలు కోల్పోయారు. 

ఇక చనిపోయే ఒక రోజు ముందు తన స్నేహితుడితో యశ్‌ వాట్సాప్‌లో మాట్లాడారు. అందులో ఎలా ఉన్నావు..? అన్న ఫ్రెండ్ ప్రశ్నకు.. నేను బాగానే ఉన్నా. మా జీవితం గురించి ఏం చెబుతాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఏదో ఒక రోజు పోతాము అని యశ్‌ సమాధానం ఇచ్చాడు. సైనికుడి జీవితం అంటే దిన దిన గండమని మిత్రుడితో తెలిపారు. ఆ మరుసటి రోజే అతడు మరణించారు. 

click me!