కరో వ్యాక్సిన్ పర్యవేక్షణ: హైదరాబాదులో ప్రధాని మోడీ

By telugu teamFirst Published Nov 28, 2020, 1:15 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ హైదరాాబదు పర్యటన ప్రారంభమైంది. మోడీ హకీంపేట విమానాశ్రయం నుంచి నేరుగా భారత్ బయోటెక్ చేరుకుంటారు. అక్కడ ఆయన కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీ పురోగతిని పరిశీలిస్తారు.

హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదు చేరుకున్నారు. హైదరాబాదులోని హకీంపేట నుంచి ఆయన నేరుగా భారత్ బయోటిక్ చేరుకుంటారు. అక్కడ కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీ పురోగతి గురించి తెలుసుకుంటారు. అహ్మదాబాద్ పర్యటనతో ప్రదాని మోడీ దేశంలోని మూడు నగరాల పర్యటన ప్రారంభమైంది.  

శనివారం ఉదయం గుజరాత్ లోని అహ్మదాబాద్ కు ఆయన చేరుకున్నారు. అక్కడి డైడెస్ క్యాడిలా బయోటెక్ పార్కును సందర్శించారు ఆ సంస్థ అభివృద్ది చేసిన జైకోవ్ - డి టీకా ప్రయోగాల గురించి ఆయన శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. 

పీపీఈ కిట్ ధర ధరించి వ్యాక్సిన్ ప్రయోగశాలను మోడీ పరిశీలించారు. ఈ వ్యాక్సిన్ ఇక్కడ ప్రస్తుతం రెండో దశ ప్రయోగాల్లో ఉంది. అంతకు ముందు మోడీ సంస్థ ప్రమోటర్లు, ఎగ్జిక్యూటివ్ లతో మాట్లాడారు. 

మోడీ దాదాపు గంట సేపు ప్లాంటులో గడిపారు. ప్రధానిని చూసేందుకు జైడస్ బయోటెక్ పార్కు వద్దకు ప్రజలు పెద్ద యెత్తున చేరుకున్నారు వారికి మోడీ అభివాదం చేశారు. 

click me!