తనకు భర్తా, ప్రియుడు ఇద్దరూ కావాలట, ఓ వివాహిత వింత కోరిక

Published : Jul 14, 2018, 03:02 PM IST
తనకు భర్తా, ప్రియుడు ఇద్దరూ కావాలట,  ఓ వివాహిత వింత కోరిక

సారాంశం

ఓ వివాహిత మధ్య ప్రదేశ్ పోలీసులకు ఓ విచిత్రమైన ఫిర్యాదు చేసింది. తనకు పెళ్లయినప్పటికి  ప్రియుడితో ప్రేమాయనం కొనసాగిస్తున్న ఈ మహిళ తాను భర్తతో పాటు ప్రియుడితో కలిసి ఉండాలనుకుంటున్నట్లు విచిత్ర కోరికను బైటపెట్టింది.  ఈమె కోరిక విని పోలీసులే నోరేళ్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇండోర్ కు చెందిన ఓ వివాహితను భర్త తరచూ కొడుతూ ఉండేవాడు.  దీంతో ఆమె తన భర్తపై ఫిర్యాదు చేయడానికి ఇండోర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ పోలీసుల ఎదుట తన కోరికను బైటపెట్టింది. తనకు పెళ్లైనప్పటికి ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అతడితో ఉండాలనుకుంటున్నట్లు సదరు మహిళ పోలీసులకు తెలిపింది. అయితే  తన భర్తను కూడా వదులుకోవాలని అనుకోవడం లేదని భర్తా, ప్రియుడు ఇద్దరితో కలిసి జీవించాలనుకుంటున్నట్లు వెళ్లడించింది.

ఈమె కోరికను విన్న పోలీసులు ఆశ్చర్యపోయారు. అనంతరం ఈమె ప్రియుడిని పిలిపించి ఈ విషయాన్ని తెలియజేశారు. అతడు కూడా తన ప్రియురాలి డిమాండ్ పై తనకెలాంటి అభ్యంతరాలు లేవని తెలిపాడు. అయితే వివాహిత భర్త మాత్రం ఇందుకు ససేమిరా ఒప్పుకునేది లేదని స్పష్టం చేశాడు. అయితే పోలీసులు కూడా మహిళ అసహజమైన కోరికను అంగీకరించలేదు.

చివరకు పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి భర్తతో కలిసుండాలని నచ్చజెప్పారు. ఇకపై భార్యను కొట్టవద్దని భర్తకు కూడా వార్నింగ్ ఇచ్చిన పోలీసులు వారిద్దని కలిపి ఇంటికి పంపించారు.  ఆమె ప్రియున్ని కూడా గట్టిగా హెచ్చరించిన పోలీసులు మరోసారి ఆమె జోలికి వెళ్లవద్దని హెచ్చరించి వదిలేశారు.
   
PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌