టిక్ టాక్ పరిచయం... యువతితో వివాహిత పరార్

Published : Sep 25, 2019, 08:41 AM ISTUpdated : Sep 25, 2019, 08:57 AM IST
టిక్ టాక్ పరిచయం... యువతితో వివాహిత పరార్

సారాంశం

టిక్‌టాక్‌ వీడియోలు గమనించిన ఆరోగ్యలియో తన భార్యకు ఫోన్‌ చేసి మందలించాడు. అయితే ఆమె పట్టించుకోలేదు. తర్వాత కూడా అభితో స్నేహం చేస్తూ వచ్చింది. వీరి స్నేహం క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది.  

టిక్ టాక్ లో ఓ వివాహితకు... ఓ యువతి పరిచయం అయ్యింది. ఆ పరిచయం వారి కాపురాన్నే కూల్చేసింది. ఏకంగా భర్తను కాదని.. ఆ యువతితో పరారయ్యింది.  ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శివగంగై జిల్లా కాళయారుకోవిల్ ప్రాంతానికి చెందిన ఆరోగ్య లియో అనే వ్యక్తికి గతేడాది వినీత అనే యువతితో వివాహమయ్యింది. వివాహమైన 45 రోజుల్లో ఆరోగ్య లియో ఉద్యోగం కోసం సింగపూర్‌ వెళ్లాడు. తరువాత వినీతకు తిరువారూరుకు చెందిన అభి అనే యువతితో టిక్‌టాక్‌ వీడియో ద్వారా పరిచయం ఏర్పడింది. 

వీరి టిక్‌టాక్‌ వీడియోలు గమనించిన ఆరోగ్యలియో తన భార్యకు ఫోన్‌ చేసి మందలించాడు. అయితే ఆమె పట్టించుకోలేదు. తర్వాత కూడా అభితో స్నేహం చేస్తూ వచ్చింది. వీరి స్నేహం క్రమంగా వివాహేతర సంబంధానికి దారి తీసింది.

అక్కడితో వీళ్ల బంధం ఆగలేదు.. వినీత... అభి ఫోటోని టాటూగా కూడా వేయించుకుంది. భార్య పూర్తిగా  అదుపు తప్పిపోయిందని కంగారుపడిన ఆరోగ్య లియో...వెంటనే స్వదేశానికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూసే సరికి  వినీత తన బంగారంతో సహా ఇంట్లో నుంచి పరారైనట్లు గుర్తించాడు. అభి అనే అమ్మాయి కోసమే వెళ్లిపోయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు  చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !