వివాహితకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. వీడియో తీసి పైశాచికానందం.. అవి చూసి, భర్త ఆత్మహత్య..

Published : Nov 22, 2022, 06:43 AM ISTUpdated : Dec 02, 2022, 09:05 PM IST
వివాహితకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం.. వీడియో తీసి పైశాచికానందం.. అవి చూసి, భర్త ఆత్మహత్య..

సారాంశం

భార్య మీద అత్యాచారం జరిగిందన్న అవమానంతో ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. అత్యాచారం చేసిన వ్యక్తి దాన్నంత వీడియో తీసి భర్తకు పంపించాడు. 

మహారాష్ట్ర : మహారాష్ట్రలో విషాద ఘటన జరిగింది. రాష్ట్రంలోని జల్నా జిల్లాలో ఓ అత్యాచార ఘటనలో భర్త ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వివాహిత మహిళపై ఒక కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ ఘటనను అంతా ఫోన్ లో రికార్డు చేశాడు. ఈ వీడియోను ఆమె భర్తకు పంపించాడు. అది చూసిన అతను తీవ్ర వేదనకు, మనస్థాపానికి గురయ్యాడు. అవమాన భారంతో కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధంచి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... పింపల్ గ్రామానికి చెందిన ఓ వివాహిత మీద ఓ వ్యక్తి కన్నేశాడు. ఆమెను లొంగదీసుకోవడానికి ఆ కామాంధుడు ఆమెకు మత్తుమందు ఇచ్చాడు. 

మత్తుమందు ప్రభావంతో ఆమె స్పృహ కోల్పోయింది. రవి దత్తాత్రేయ అనే దుండగుడు ఆ తరువాత ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆ దారుణాన్ని మొత్తం మొబైల్ ఫోన్లో వీడియో తీశాడు. ఆ వీడియోలను ఆ తరువాత సదరు మహిళ భర్తకు పంపించాడు. అది చూసిన భర్త షాక్ కు గురయ్యాడు. ఆ వీడియోలు వెలుగులోకి వస్తే సమాజంలో పరువు పోతుందని..తీవ్ర ఆవేదన చెందాడు. మనస్తాపానికి గురయ్యాడు. అంతే వివాహిత భర్త దారుణ నిర్నయానికి వచ్చాడు. విషం తాగి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయానికి సంబంధించిన సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు.. ఈ ఘటనలో ముగ్గురు పురుషులతో పాటు ఇద్దరు మహిళల మీద పోలీసులు కేసు నమోదు చేసినట్లు  తెలిపారు. 

ముంబ‌యిలో రూ.20 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం.. ఇద్ద‌రు విదేశీయులు అరెస్టు

ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 20న జార్ఖండ్ లో ఇలాంటి దారుణమైన ఘటనే చోటుచేసుకుంది. ఓ బాలికపై యువకుడు దాష్టీకానికి పడ్డాడు. ఆమె తనను ప్రేమిస్తోందని స్నేహితుల ముందు రుజువు చేసుకునేందుకు బాలిక మీద అత్యాచారానికి తెగబడ్డాడు. వివరాల్లోకి వెళితే…  కోయలంచల్ ధన్ బాద్ ప్రాంతానికి చెందిన కొందరు యువకుల మధ్య ఓ బాలిక విషయంలో ఇటీవల గొడవ జరిగింది. ఆమె తనను ప్రేమిస్తుందని యువకుల్లో ఒకరు చెప్పారు. దీంతో తననే ప్రేమిస్తోందని సంజయ్ అనే మరో వ్యక్తి వాదించాడు. 

అంతేకాదు, తానే ఆమె ప్రేమికుడినని నిరూపించుకుంటానని.. వారి ముందు సవాలు చేశాడు. మరుసటిరోజు బాలికకు మాయమాటలు చెప్పి పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఆధారాలు వీడియో తీసి స్నేహితులకు పంపించాడు. వారు ఆ వీడియోను బంధువులకు చూపించడంతో జరిగిన ఘోరం వెలుగు లోకి వచ్చింది.  బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంజయ్ ను అరెస్టు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu