మహిళ దారుణహత్య: ముక్కలు ముక్కలుగా నరికి.. తల, మొండెం వేరు చేసి

Siva Kodati |  
Published : May 14, 2019, 07:45 AM IST
మహిళ దారుణహత్య: ముక్కలు ముక్కలుగా నరికి.. తల, మొండెం వేరు చేసి

సారాంశం

కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. మంగళూరులోని ఓ షాప్ ముందు మనిషి శరీర భాగాలు పడి ఉండటాన్ని గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు రక్తపు సంచులతో పాటు ఓ హెల్మెట్‌లో మహిళ తలను  స్వాధీనం చేసుకున్నారు. ఆమె పేరు శ్రీమతి శెట్టి అని... ఆమె పండేశ్వర్‌లో ఓ ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తోందని, భర్త సుదీప్‌తో విడాకులు తీసుకున్న అనంతరం ఆమె ప్రస్తుతం ఒంటరిగా నివసిస్తోంది.

ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు శెట్టిని దారుణంగా హత మార్చారు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తల, మొండెం వేరు చేశారు. అక్కడితో ఆగకుండా శరీర భాగాలను రెండు సంచులలో కుక్కి మొండాన్ని నందిగూడలో, తలను నంటూర్ జాతీయ రహదారి సమీపంలో పడేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో శెట్టి భర్త ప్రమేమయం ఉందా అన్న కోణంలో ఆరా తీయగా.. అతను మొబైల్ చోరీ కేసులో ప్రస్తుతం మంగళూరు జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. 

PREV
click me!

Recommended Stories

ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్
భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?