ఇంటి పని చేయాలనడం గృహహింస కాదు : బాంబే హైకోర్టు

Published : Oct 28, 2022, 03:33 AM IST
ఇంటి పని చేయాలనడం గృహహింస కాదు : బాంబే హైకోర్టు

సారాంశం

పెండ్లయిన మహిళను కుటుంబం కోసం పని చేయాలనడం పనిమనిషితో సమానంగా చూడటం కాదని, అది క్రూరత్వం కిందకు రాదని బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో భర్త,అత్తామామలపై దాఖలైన గృహహింస కేసును.. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిపై  దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కూడా కొట్టివేసింది

పెళ్లయిన మహిళను ఇంటి పని చేయాలనడం ఇంటి పనిమనిషి పనితో సమానంగా చూడటం కాదని, అది మహిళల పట్ల క్రూరత్వం కాదని బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది.  ఇంటిపని చేయకూడదనుకుంటే ఆ విషయాన్నిపెళ్లికి ముందే చెప్పాలని కోర్టు పేర్కొంది.  సదరు వివాహిత భర్తపై, అత్తామామలపై దాఖలు చేసిన గృహహింస కేసును  జస్టిస్ విభా కంకన్‌వాడి, జస్టిస్ రాజేష్ పాటిల్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.

వివాహితను ఇంటిపని చేయమని ఆ కుటుంబం కచ్చితంగా అడుగుతారని.. పనిమనిషిలా చూస్తున్నారని చెప్పలేమని బెంచ్ పేర్కొంది. స్త్రీకి తన ఇంటి పనులు చేయాలనే కోరిక లేకపోతే.. ఆమె పెళ్లికి ముందే చెప్పాలి. పెళ్లి తర్వాత ఈ పరిస్థితి తలెత్తితే, అలాంటి సమస్య ముందుగానే పరిష్కరించబడుతాయని, ఇలాంటి సమస్యలు తల్లెత్తవని పేర్కొంది. సదరు మహిళ తన భర్తపై, అతని కుటుంబ సభ్యులపై సెక్షన్ 498Aతో పాటు, IPC సెక్షన్లు 323(గాయపరచడం), 504 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపు) సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. అలాంటి.. కట్నం డిమాండ్ చేస్తున్నారని  ఫిర్యాదులో పేర్కొన్నారు.

వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా భాగ్యనగర్ పోలీస్ స్టేషన్‌లో ఓ వివాహిత తన అత్తమామలు, భర్తపై ఫిర్యాదు చేసింది. పెళ్లయిన నెల రోజుల తరువాత నుంచి తన  భర్త, అత్తమామలు తనను పనిమనిషిలా చూస్తున్నారని, అలాగే.. కారు కొనడానికి తన అత్తమామలు, భర్త రూ.4 లక్షలు డిమాండ్ చేయడం ప్రారంభించారని మహిళ ఆరోపించింది. తన తండ్రి వారు కోరిన మొత్తాన్ని ఇవ్వకపోతే.. తనని తన భార్త కొట్టాడని, మానసికంగా హింసించాడని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె తన మొదటి భర్తపై కూడా ఇలాంటి ఆరోపణలు చేసింది. 

తనను వేధిస్తున్నారని పలు ఆరోపణలు చేసిన మహిళ స్పష్టంగా ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయిందని బెంచ్  అభిప్రాయపడింది. కుటుంబం కోసం పనిచేయమనడం పనిమనిషిలా చూడటం ఎలా అవుతుందని ప్రశ్నించింది. ఒకవేళ ఇంటిపని చేయడం ఇష్టం లేకపోతే సదరు మహిళ పెళ్లికి  ముందే ఆ విషయాన్ని
చెప్పి ఉండాల్సిందని కోర్టు తెలిపింది. మానసికంగా, శారీరకంగా వేధించారని 498ఏ కింద కేసు పెట్టడమే కాదు.. అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని  స్పష్టం చేసింది.

PREV
click me!

Recommended Stories

పాము కాటుతో మ‌ర‌ణించిన తండ్రి పేరుపై రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్‌.. అస‌లు మ్యాట‌ర్ తెలిస్తే ఫ్యూజులు అవుట్
MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్