ఛత్తీస్ ఘడ్ లో ఐదుగురి కిడ్నాప్: ఒకరిని హత్య చేసిన మావోయిస్టులు

Published : Mar 05, 2023, 04:12 PM ISTUpdated : Mar 05, 2023, 04:30 PM IST
 ఛత్తీస్ ఘడ్ లో  ఐదుగురి కిడ్నాప్: ఒకరిని హత్య చేసిన మావోయిస్టులు

సారాంశం

ఛత్తీస్ ఘడ్  రాష్ట్రంలోని  కొండగావ్  జిల్లాలో  మావోయిస్టులు   ఐదుగురిని కిడ్నాప్  చేశారు.  వీరిలో  ఒకరిని   మావోయిస్టులు హత్య  చేశారు. 


రాయ్‌పూర్:ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని  కొండగావ్  జిల్లాలో మావోయిస్టులు ఐదుగురిని  కిడ్నాప్  చేశారు.  వీరిలో  ఒకరిని మావోయిస్టులు  హతమార్చారు.  ఇన్ ఫార్మర్ నెపంతో  మావోయిస్టులు  అతడిని హత్య  చేశారని సమాచారం.

గత  15 రోజుల క్రితం  ఇదే  ప్రాంతంలో  ఇద్దరు గ్రామస్తులను మావోయిస్టులు హత్య  చేశారు. 
కొండగావ్   జిల్లాలోని  పుంగరపాల్  పోలీస్ స్టేషన్ పరిధిలోని  తుమ్డివాల్  గ్రామంలో  మావోయిస్టులు  ఐదుగురిని కిడ్నాప్  చేశారు. మావోయిస్టుల  కదలికలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు  ఎవరిస్తున్నారనే విషయమై  మావోయిస్టులు  విచారించారు.  కిడ్నాప్  చేసిన వారిలో  ఒకరిని  మావోయిస్టులు హత్య చేశారు. ఇద్దరిని ఇంకా తమ అదుపులోనే ఉంచుకున్నారు.

హత్య చేసిన వ్యక్తి మృతదేహన్ని  గ్రామ సర్పంచ్  నివాసానికి  సమీపంలో  వదిలి వెళ్లారు. . కిడ్నాప్ చేసిన  వారిలో  ఇద్దరిని  మావోయిస్టులు వదిలి పెళ్లారు. మరో ఇద్దరు  మావోయిస్టుల అదుపులోనే  ఉన్నారు.  తమ అదుపులో  ఇద్దరిని  సురక్షితంగా  విడిచిపెట్టాలని  గ్రామస్తులు  కోరుతున్నారు.  

 ఈ విషయమై  పోలీసులు  సంఘటన స్థలాన్ని  పోలీసులు  పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు  చేసుకొని  దర్యాప్తు  చేస్తున్నాయి. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని  కొన్ని జిల్లాల్లో  మావోయిస్టులు తమ ఉనినికి  చాటుకొనే ప్రయత్నం  చేస్తున్నారు.  అవకాశం వచ్చినప్పుడల్లా  తమ ఉనికిని చాటుకొనే  కార్యక్రమాలకు  మావోయిస్టులు పాల్పడుతున్నారు.  రోడ్ల నిర్మాణం  చేస్తున్న సామాగ్రితో  పాటు  వాహనాలు  వంటి  వాటిని  మావోయిస్టులు  ధ్వంసం  చేసిన ఘటనలు  కూడా  రాష్ట్రంలో  చోటు  చేసుకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?